మెట్రో క్యాష్‌ అండ్‌ క్యారీ బైబై?

జర్మనీ రిటైల్‌ దిగ్గజ సంస్థ మెట్రో ఏజీ భారత్‌లోని క్యాష్‌ అండ్‌ క్యారీ  వ్యాపారాన్ని విక్రయించే యోచనలో ఉన్నట్లు సమాచారం. ప్రస్తుతం ఈ సంస్థకు దేశవ్యాప్తంగా 31 టోకు విక్రయ కేంద్రాలు  ఉన్నాయి.

Published : 21 May 2022 02:36 IST

దిల్లీ: జర్మనీ రిటైల్‌ దిగ్గజ సంస్థ మెట్రో ఏజీ భారత్‌లోని క్యాష్‌ అండ్‌ క్యారీ  వ్యాపారాన్ని విక్రయించే యోచనలో ఉన్నట్లు సమాచారం. ప్రస్తుతం ఈ సంస్థకు దేశవ్యాప్తంగా 31 టోకు విక్రయ కేంద్రాలు  ఉన్నాయి. వీటిని 1.5- 1.75 బిలియన్‌ డాలర్ల (సుమారు రూ.11,625 కోట్లు- 13,500 కోట్ల)కు విక్రయించడం ద్వారా భారత్‌ నుంచి వైదొలగాలని మెట్రో భావిస్తున్నట్లు తెలుస్తోంది. భారత్‌లోని మెట్రో వ్యాపారాలను కొనుగోలు చేసేందుకు అమెజాన్‌, రిలయన్స్‌ రిటైల్‌, అవెన్యూ సూపర్‌మార్ట్స్‌ (డి-మార్ట్‌), టాటా గ్రూపు, లూలూ గ్రూపు, సమారా కేపిటల్‌, థాయ్‌లాండ్‌కు చెందిన ఖరోయో పోక్‌ఫాండ్‌ (సీపీ) గ్రూపులు ఆసక్తి చూపుతున్నాయని విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. సరైన కొనుగోలుదారును వెతికేందుకు జేపీ మోర్గాన్‌, గోల్డ్‌మాన్‌ శాక్స్‌ను మెట్రో నియమించుకున్నట్లు సమాచారం. ప్రస్తుతానికైతే ఈ సంప్రదింపులు ప్రాథమిక దశలోనే ఉన్నట్లు తెలుస్తోంది. 2003 నుంచి భారత్‌లో మెట్రో కార్యకలాపాలు నిర్వహిస్తోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని