అమరరాజా లాభం రూ.99 కోట్లు

గత ఆర్థిక సంవత్సరం (2021-22) నాలుగో త్రైమాసికంలో అమరరాజా బ్యాటరీస్‌ ఏకీకృత ప్రాతిపదికన రూ.98.85 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది. అంతక్రితం ఆర్థిక సంవత్సరం ఇదే త్రైమాసికంలో

Published : 21 May 2022 02:36 IST

దిల్లీ: గత ఆర్థిక సంవత్సరం (2021-22) నాలుగో త్రైమాసికంలో అమరరాజా బ్యాటరీస్‌ ఏకీకృత ప్రాతిపదికన రూ.98.85 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది. అంతక్రితం ఆర్థిక సంవత్సరం ఇదే త్రైమాసికంలో కంపెనీ లాభం రూ.189.38 కోట్లతో పోలిస్తే ఇది 47.80 శాతం తక్కువ. ఇదే సమయంలో మొత్తం కార్యకలాపాల ఆదాయం రూ.2,102.61 కోట్ల నుంచి 3.72 శాతం పెరిగి రూ.2,180.96 కోట్లకు చేరింది. లెడ్‌-యాసిడ్‌ బ్యాటరీ వ్యాపారంలో అంతర్జాతీయంగా విస్తరించేందుకు అవకాశాలు పరిశీలిస్తున్నామని,  కొత్త ఇంధన టెక్నాలజీల్లో మంచి పురోగతి సాధించామని కంపెనీ సీఎండీ జయదేవ్‌ గల్లా పేర్కొన్నారు. 2021-22 ఆర్థిక సంవత్సరానికి రూ.1 ముఖవిలువ కలిగిన ఒక్కోషేరుపై రూ.0.50 (50 శాతం) తుది డివిడెండును బోర్డు సిఫారసు చేసింది. నవంబరులో ప్రకటించిన రూ.4 మధ్యంతర డివిడెండుకు ఇది అదనం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని