ఏకఛత్రాధిపత్యం లేకుండా చూడాలి

మార్కెట్లో వ్యక్తులు ‘కుమ్మక్కు కాకుండా చూడడం పెద్ద సవాలు’గా మారిందని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ పేర్కొన్నారు. ఒకరు లేదా ఇద్దరే ఆధిపత్యం చెలాయించడంతో ధరలు పెరగడం కానీ,

Published : 21 May 2022 02:36 IST

ధరలు పెరగడానికి అదే కారణం

కుమ్మక్కుకాకుండా చూడడం పెద్ద సవాలు

ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌

దిల్లీ: మార్కెట్లో వ్యక్తులు ‘కుమ్మక్కు కాకుండా చూడడం పెద్ద సవాలు’గా మారిందని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ పేర్కొన్నారు. ఒకరు లేదా ఇద్దరే ఆధిపత్యం చెలాయించడంతో ధరలు పెరగడం కానీ, సరఫరాలో అవకతవకలు చోటుచేసుకుంటాయని, వీటిని నిరోధించేందుకు సరఫరా వైపు సమస్యలపై దృష్టి సారించాలని ఆమె పిలుపునిచ్చారు. భారత్‌ తన సొంత వినియోగానికి, ఎగుమతులకు సైతం ఉత్పత్తులను అందించగల సామర్థ్యం ఉన్నప్పటికీ.. ముడిపదార్థాల వ్యయాలు పెరగడంపై కొంత మేర ఫిర్యాదులు వస్తున్నాయని మంత్రి అన్నారు. కరోనా, రష్యా యుద్ధ ప్రభావం వల్ల తూర్పు ఐరోపాలో సరఫరా వ్యవస్థలకు అవాంతరం ఏర్పడడంతో కమొడిటీలు, ముడి పదార్థాలకు అంతర్జాతీయంగా కొరత ఏర్పడిందని సీతారామన్‌  శుక్రవారమిక్కడ జరిగిన సీసీఐ 13వ వార్షికోత్సవంలో పేర్కొన్నారు. ‘గిరాకీ ఎక్కువగా ఉన్న రంగాల్లో కంపెనీలు తమ సామర్థ్యాన్ని విస్తరించడం వల్ల కుమ్మక్కుకాకుండా చూడడం సవాలుగా మారుతోంది. ఈ సమయంలో సీసీఐ అసలేం జరుగుతోందో అర్థం చేసుకుని నడవాల’ని మంత్రి పిలుపునిచ్చారు. గత రెండేళ్లుగా కాంపిటీషన్‌ కమిషన్‌ ఆఫ్‌ ఇండియా(సీసీఐ) సవాళ్లను సమర్థంగా ఎదుర్కొంటోందని కార్పొరేట్‌ వ్యహారాల మంత్రి కూడా అయిన సీతారామన్‌ ప్రశంసించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని