రాష్ట్రాలు పెట్రో పన్నులు తగ్గించాలి

పెట్రోల్‌, డీజిల్‌పై కేంద్రం ఎక్సైజ్‌ సుంకం తగ్గింపు నిర్ణయాన్ని భారత కార్పొరేట్‌ వర్గాలు, ట్రేడర్లు, ఎగుమతిదార్లు ఆహ్వానించారు. రాష్ట్రాలు కూడా సుంకాలను తగ్గించి వినియోగదారులకు మరింత ఉపశమనం అందించాలని కోరారు. ఇంధన ధరలు తగ్గితే సరకు రవాణా వ్యయాలు తగ్గి ద్రవ్యోల్బణం అదుపులోకి వస్తుందని అన్నారు. ‘ఇంధనంపై ఎక్సైజ్‌ సుంకం

Published : 23 May 2022 02:24 IST

పరిశ్రమ సంఘాల డిమాండ్‌

దిల్లీ: పెట్రోల్‌, డీజిల్‌పై కేంద్రం ఎక్సైజ్‌ సుంకం తగ్గింపు నిర్ణయాన్ని భారత కార్పొరేట్‌ వర్గాలు, ట్రేడర్లు, ఎగుమతిదార్లు ఆహ్వానించారు. రాష్ట్రాలు కూడా సుంకాలను తగ్గించి వినియోగదారులకు మరింత ఉపశమనం అందించాలని కోరారు. ఇంధన ధరలు తగ్గితే సరకు రవాణా వ్యయాలు తగ్గి ద్రవ్యోల్బణం అదుపులోకి వస్తుందని అన్నారు. ‘ఇంధనంపై ఎక్సైజ్‌ సుంకం కోత నిర్ణయాన్ని ఆహ్వానిస్తున్నాం. ద్రవ్యోల్బణాన్ని ఇది తగ్గిస్తుంది. సామాన్యుడిపై భారాన్ని తగ్గించాలన్న ప్రభుత్వ ఆలోచనను ఇది చెబుతోంది. అదనంగా పలు రంగాల కంపెనీలకు ముడి వ్యయాలు కూడా తగ్గుతాయి’ అని సీఐఐ అధ్యక్షుడు సంజీవ్‌ బజాజ్‌ పేర్కొన్నారు. పెట్రోల్‌, డీజిల్‌పై ఎక్సైజ్‌ పన్ను కోత సహా ప్రభుత్వం తీసుకున్న ద్రవ్యోల్బణ నియంత్రణ చర్యలను అసోచామ్‌ సెక్రటరీ జనరల్‌ దీపక్‌ సూద్‌ కొనియాడారు. పన్ను కోతల వల్ల నిత్యావసరాలపై సగటున కనీసం 10 శాతం ధరలు తగ్గే అవకాశం ఉంటుందని కాన్ఫెడరేషన్‌ ఆఫ్‌ ఆలిండియా ట్రేడర్స్‌ (కాయిట్‌) వెల్లడించింది. రాష్ట్రాలు కూడా పన్నులు తగ్గించాలని పీహెచ్‌డీసీసీఐ అధ్యక్షుడు ప్రదీప్‌ ముల్తానీ కోరారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని