బ్యాంకింగ్‌పై నమ్మకం ఉంటే..

నవీ మ్యూచువల్‌ ఫండ్‌ బ్యాంక్‌ నిఫ్టీ ఆధారిత మ్యూచువల్‌ ఫథకాన్ని కొత్తగా ఆవిష్కరించింది. నవీ నిఫ్టీ బ్యాంక్‌ ఇండెక్స్‌ ఫండ్‌ అనే ఈ పథకం  ఎన్‌ఎఫ్‌ఓ ముగింపు తేదీ ఈ నెల 31. ఎన్‌ఎఫ్‌ఓలో కనీస పెట్టుబడి రూ.500. ఇది ఓపెన్‌

Updated : 21 Jan 2022 12:18 IST

నవీ నిఫ్టీ బ్యాంక్‌ ఇండెక్స్‌ ఫండ్‌

వీ మ్యూచువల్‌ ఫండ్‌ బ్యాంక్‌ నిఫ్టీ ఆధారిత మ్యూచువల్‌ ఫథకాన్ని కొత్తగా ఆవిష్కరించింది. నవీ నిఫ్టీ బ్యాంక్‌ ఇండెక్స్‌ ఫండ్‌ అనే ఈ పథకం  ఎన్‌ఎఫ్‌ఓ ముగింపు తేదీ ఈ నెల 31. ఎన్‌ఎఫ్‌ఓలో కనీస పెట్టుబడి రూ.500. ఇది ఓపెన్‌ ఎండెడ్‌ పథకం. ఫండ్‌ నిర్వహణ వ్యయాలూ తక్కువ. డైరెక్ట్‌ ప్లాన్‌లో వ్యయాల నిష్పత్తి (ఎక్స్‌పెన్సెస్‌ రేషియో) 0.12 శాతం మాత్రమే. ఈ పథకం కింద ప్రధానంగా బ్యాంకింగ్‌ రంగంలోని 12 అగ్రశ్రేణి బ్యాంకులపై పెట్టుబడి పెడతారు. నిఫ్టీ బ్యాంక్‌ ఇండెక్స్‌ గత ఏడాది కాలంలో 14 శాతం ప్రతిఫలాన్ని ఇచ్చింది. గత 5 ఏళ్లలో 12.5 చొప్పున, గత 10 ఏళ్లలో 16.9 శాతం చొప్పున వార్షిక వృద్ధి కనిపించింది. మనదేశ ఆర్థిక వ్యవస్థ త్వరలో 5 ట్రిలియన్‌ డాలర్లకు చేరుతుందనే అంచనాలు ఉన్న విషయం విదితమే. ఆ క్రమంలో బ్యాంకింగ్‌ రంగం క్రియాశీలకమైన పాత్ర పోషించాల్సి ఉంటుంది. అదే జరిగితే బ్యాంకులు విశేషంగా లాభపడతాయి. నవీ నిఫ్టీ బ్యాంక్‌ ఇండెక్స్‌ ఫండ్‌ ద్వారా ఈ వృద్ధి అవకాశాలను అందిపుచ్చుకునే అవకాశం ఉంటుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని