
Updated : 08 Nov 2020 16:34 IST
ఎల్ఓసీ వద్ద కాల్పులు.. జవాను వీరమరణం
ఎదురు కాల్పుల్లో ఉగ్రవాది హతం
జమ్మూకశ్మీర్ : జమ్మూకశ్మీర్లోని మాచిల్ సెక్టార్ ప్రాంతంలో ఆదివారం భారత సైన్యం ఓ ఉగ్రవాదిని మట్టుబెట్టింది. ముష్కరుల అక్రమ చొరబాటు యత్నాలను సైన్యం తిప్పికొట్టింది. సైన్యానికి, ఉగ్రవాదులకు మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో బీఎస్ఎఫ్ జవాను సుదీప్ కుమార్ వీరమరణం పొందారు. ఈ సెక్టార్లోని నియంత్రణ రేఖ వద్ద శనివారం రాత్రి అనుమానాస్పద కదలికలు ఉన్నట్లు సమాచారం అందుకున్న భద్రతా బలగాలు నిఘా ఉంచాయి. చొరబాటుకు యత్నించిన ఉగ్రవాదులపై కాల్పుల జరిపాయి. ఏకే 47 తుపాకీ, రెండు బ్యాగులను స్వాధీనం చేసుకున్నట్లు ఆర్మీ ప్రతినిధి కల్నల్ రాజేశ్ కాలియా తెలిపారు. ఉగ్రవాదుల ఏరివేతకు సంబంధించి గాలింపు చర్యలు కొనసాగుతున్నట్లు ఆయన వివరించారు.
Tags :