వేధింపులు తాళలేక కారులో నుంచి దూకేసి..

ఓ క్యాబ్‌ డ్రైవర్‌ వేధింపులు భరించలేని ఇద్దరు మహిళలు నడుస్తున్న కారులోంచి బయట దూకేశారు. ఇది గమనించిన స్థానికులు కారును వెంబడించి అందులో ఉన్న మరో మహిళను రక్షించారు...

Updated : 18 Oct 2020 13:59 IST

అమృత్‌సర్‌: ఓ క్యాబ్‌ డ్రైవర్‌ వేధింపులు భరించలేక ఇద్దరు మహిళలు ప్రయాణిస్తున్న కారులోంచి బయట దూకేశారు. ఇది గమనించిన స్థానికులు కారును వెంబడించి అందులో ఉన్న మరో మహిళను రక్షించారు. ఈ ఘటన పంజాబ్‌లోని అమృత్‌సర్‌లో చోటుచేసుకుంది. రంజిత్‌ ఎవెన్యూ ప్రాంతంలోని ఓ రెస్టారెంట్‌కు వెళ్లేందుకు ముగ్గురు మహిళలు ఓ క్యాబ్‌ను‌ మాట్లాడుకున్నారు. అయితే, దారిమధ్యలో క్యాబ్‌ డ్రైవర్‌ ఓ మహిళపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. ఆమె ప్రతిఘటించడంతో క్యాబ్‌ వేగాన్ని పెంచి తన దుశ్చర్యను కొనసాగించాడు. అతడి నుంచి ఎలాగైనా తప్పించుకోవాలనే ఉద్దేశంతో ఇద్దరు మహిళలు నడుస్తున్న కారులో నుంచి బయటకు దూకేశారు. దీంతో వారికి గాయాలయ్యాయి. వారు బయటకు దూకడాన్ని గమనించిన స్థానికులు కారును వెంబడించి అందులో ఉన్న మరో మహిళను కాపాడారు. డ్రైవర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు.
 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని