తమిళనాడులో అల్లర్లు: ఇళ్లు, వాహనాలకు నిప్పు

తమిళనాడులోని కడలూరు జిల్లాలో ఇరు వర్గాల మధ్య చోటుచేసుకున్న తీవ్ర ఘర్షణలు చోటుచేసుకున్నాయి. ఈ ఘర్షణల్లో ఒకరు మృతి చెందగా, పలువురు గాయపడ్డారు...

Updated : 03 Aug 2020 08:59 IST

చెన్నై: తమిళనాడులోని కడలూరు జిల్లాలో ఇరు వర్గాల మధ్య  తీవ్ర ఘర్షణలు చోటుచేసుకున్నాయి. ఈ ఘర్షణల్లో ఒకరు మృతి చెందగా, పలువురు గాయపడ్డారు. పదుల సంఖ్యలో పడవలు, ద్విచక్ర వాహనాలు, ఇళ్లు, కార్లు అగ్నికి ఆహుతయ్యాయి. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది సహాయంతో మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ఇప్పటి వరకు ఈ ఘర్షణలతో సంబంధం ఉన్న 50 మందిని పోలీసులు అరెస్టు చేశారు. రెండు వర్గాల మధ్య చాలా రోజులుగా రాజకీయంగా వైరం ఉన్నట్లు పోలీసులు తెలిపారు. గతేడాది డిసెంబరులో జరిగిన పంచాయితీ ఎన్నికల సందర్భంగా చోటుచేసుకున్న ఘర్షణలు దీనికి ప్రధాన కారణంగా భావిస్తున్నారు.

అయితే కొద్ది రోజుల క్రితం స్థానిక రాజకీయ నాయకుడి సోదరుడిని ప్రత్యర్థి వర్గం హత్య చేసింది. దీంతో సదరు నాయకుడికి చెందిన వ్యక్తులు ప్రత్యర్థి వర్గానికి చెందిన ఇళ్లపై దాడి దిగినట్లు స్థానిక వర్గాలు తెలిపాయి. ప్రస్తుతం పరిస్థితి అదుపులో ఉందని పెద్ద ఎత్తున పోలీసు బలగాలను మోహరించినట్లు కడలూరు జిల్లా పోలీసు అధికారి ఎం. శ్రీ అభినవ్‌ తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని