దావూద్‌ ఇబ్రహీం అనుచరుడు మజీద్‌ అరెస్టు

అండర్‌వరల్డ్‌ డాన్‌ దావూద్‌ ఇబ్రహీం అనుచరుడు అబ్దుల్‌ మజీద్‌ కుట్టీని గుజరాత్‌ ఉగ్రవాద నిరోధక దళం (ఏటీఎస్‌) అరెస్టు చేసింది. 24 ఏళ్లుగా తప్పించుకొని తిరుగుతున్న అతడిని జంషెడ్‌పుర్‌లో....

Published : 29 Dec 2020 01:14 IST

జంషెడ్‌పుర్‌: అండర్‌వరల్డ్‌ డాన్‌ దావూద్‌ ఇబ్రహీం అనుచరుడు అబ్దుల్‌ మజీద్‌ కుట్టీని గుజరాత్‌ ఉగ్రవాద నిరోధక దళం (ఏటీఎస్‌) అరెస్టు చేసింది. 24 ఏళ్లుగా తప్పించుకొని తిరుగుతున్న అతడిని జంషెడ్‌పుర్‌లో అదుపులోకి తీసుకున్నారు. 1997లో గణతంత్ర దినోత్సవం రోజున గుజరాత్‌, మహారాష్ట్రలో పేలుళ్లకు దావూద్‌ పన్నిన కుట్రలో మజీద్‌ భాగస్వామి అని అధికారులు స్పష్టం చేశారు. 24 ఏళ్లుగా పరారీలో ఉన్న మజీద్‌ ఝార్ఖండ్‌లో కొన్నేళ్లుగా గుట్టుచప్పుడు కాకుండా నివసిస్తున్నట్లు గుర్తించారు. పేలుళ్లకు సంబంధించి 106 తుపాకులు, 4 కిలోల మందుగుండు, మరికొన్ని పేలుడు సామగ్రిని విక్రయించిన కేసులో మజీద్‌ నిందితుడు. ముంబయి పేలుళ్ల కేసులోనూ అతడు నిందింతుడు.

ఇవీ చదవండి...

భార్యను హత్య చేసి... సాక్ష్యాలను మార్చేసి...!

నమ్మితే అత్యాచారం చేశాడు


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని