Published : 22/11/2020 18:27 IST

మహిళలపై వేధింపులు.. రోడ్డుపైనే గుంజీళ్లు!

భోపాల్‌: మధ్యప్రదేశ్‌ పోలీసులు తమదైన శైలిలో ఆకతాయిల ఆట కట్టించారు. దివాస్‌ పట్టణంలోని వీధుల్లో కొందరు యువకులు మహిళలు, యువతులను వేధిస్తుండగా వారిని వినూత్న రీతిలో కట్టడి చేశారు. దారిన పోయే మహిళల్ని లైంగికంగా వేధిస్తున్న యువకుల్ని పోలీసులు రహదారిపైనే గుంజీళ్లు తీయించారు. మహిళా కానిస్టేబుల్‌ మనీషా తెలిపిన వివరాల ప్రకారం.. ‘గత కొంత కాలంగా కొందరు యువకులు రహదారిపై వచ్చిపోయే మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తున్నారు. దీంతో ఆ ప్రాంతంలోని యువతులు ఇళ్ల నుంచి బయటకు రావడానికి భయపడుతున్నారు. ఒకానొక సందర్భంలో వారు మహిళా కానిస్టేబుల్‌పైనా అదే రీతిలో ప్రవర్తించారు. మహిళల పట్ల ఇలాంటి ప్రవర్తన సహించకూడదనే ఉద్దేశంతోనే వారితో గుంజీళ్లు తీయించాం’ అని కానిస్టేబుల్‌ వెల్లడించారు. 


Read latest Crime News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని