నన్ను కాల్చొద్దు..  నేరస్థుడి వింత లొంగుబాటు

కనిపించిన వెంటనే పోలీసులు కాల్చి చంపుతారనే అనుమానం అతన్ని వేధించింది...

Updated : 28 Sep 2020 17:05 IST

సంభాల్‌: నేర చరిత్రతో పోలీసు రికార్డులకెక్కిన ఓ వ్యక్తి పోలీసులకు లొంగిపోవాలనుకున్నాడు. అయితే తాను కనిపించిన వెంటనే పోలీసులు కాల్చి చంపుతారనే అనుమానం అతడిని వేధించింది. అందుకోసం ఓ ఉపాయాన్ని ఆలోచించాడు. ‘‘నన్ను కాల్చవద్దు..’’ అని రాసి ఉన్న ఓ అట్టముక్కను మెడలో ధరించి మరీ.. పోలీసుల ముందుకు వెళ్లాడు.

నయీమ్‌ అనే ఈ వ్యక్తి ఉత్తర్‌ ప్రదేశ్‌లోని సంభాల్‌ ప్రాంతంలోని నక్షాసా పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో ఆదివారం సాయంత్రం లొంగిపోయాడు. ‘‘నాకు సంభాల్‌ పోలీసులంటే భయం. నేను నా తప్పులను ఒప్పుకుంటున్నాను. నేను లొంగిపోతున్నాను. దయచేసి నన్ను కాల్చకండి’’ అని రాసి ఉన్న అట్ట ముక్కను ధరించి పోలీస్‌ స్టేషన్‌లోకి అడుగుపెట్టాడు. నయీమ్‌ వివిధ నేరాల్లో నిందితుడని.. అతడిని పట్టిస్తే రూ.15,000 బహుమతి కూడా ప్రకటించినట్లు పోలీసులు తెలిపారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని