కేసు వాపసు తీసుకోనందుకు ఇంటికి నిప్పు 

పోలీసు కేసు వాపసు తీసుకోనందుకు ఇద్దరు దళిత సోదరులపై కొందరు దాడి చేసి, ఇంటికి నిప్పంటించారు. ఈ సంఘటన మధ్యప్రదేశ్‌లోని దాటియా జిల్లాలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. దాటియా జిల్లాకు చెందిన

Published : 23 Nov 2020 00:44 IST

భోపాల్‌:  పోలీసు కేసు వాపసు తీసుకోనందుకు ఇద్దరు దళిత సోదరులపై కొందరు దాడి చేసి, ఇంటికి నిప్పంటించారు. ఈ సంఘటన మధ్యప్రదేశ్‌లోని దాటియా జిల్లాలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. దాటియా జిల్లాకు చెందిన సందీప్‌ దోహరె, సంత్రమ్‌ దోహరె సోదరులకు, పవన్‌ యాదవ్‌కు మధ్య గత రెండు సంవత్సరాలుగా డబ్బు చెల్లింపుల విషయంలో వివాదం చెలరేగింది. ఈ క్రమంలో దోహరె సోదరుల ఫిర్యాదు మేరకు 2018లో పవన్‌ యాదవ్‌పై పోలీసులు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారు. దీంతో కేసు వాపసు తీసుకోవాలని పవన్‌ యాదవ్‌ వారిని బెదిరిస్తున్నాడు. ఈ క్రమంలో నిందితుడు, అతని కుటుంబ సభ్యులు సుమారుగా 15 మంది ఇనుప రాడ్లు, గొడ్డళ్లతో సందీప్‌ దోహరె సోదరులపై తీవ్రంగా దాడి చేయడంతో పాటు వారి ఇంటికి నిప్పంటించారు. వెంటనే చుట్టుపక్కల వారు తేరుకొని అక్కడికి రావడంతో నిందితులు పరారయ్యారు. ఈ ఘటనలో నిందితుల మూడు వాహనాలు సైతం కాలిపోయాయి. అనంతరం స్ధానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఈ ఘటనలో గాయపడిన వారిని చికిత్స నిమిత్తం సమీప ఆసుపత్రికి తరలించారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని