హాథ్రస్‌ బాధితురాలంటూ ఆమె చిత్రాలు

ఆయన భార్య చిత్రాలను హాథ్రస్‌ బాధితురాలంటూ వివిధ సామాజిక మాధ్యమాల్లో తప్పుగా ప్రచారం

Published : 17 Oct 2020 01:33 IST

దిల్లీ హైకోర్టులో వ్యక్తి ఫిర్యాదు

దిల్లీ: తన భార్య చిత్రాలను హాథ్రస్‌ బాధితురాలంటూ వివిధ సామాజిక మాధ్యమాల్లో తప్పుగా ప్రచారం చేస్తున్నారంటూ ఓ వ్యక్తి న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. మరణించిన తన భార్య చిత్రాన్ని.. హాథ్రస్‌ సామూహిక హత్యాచార ఘటనలో ప్రాణాలు కోల్పోయిన బాధితురాలిగా ప్రచారం చేస్తున్నారని అజయ్‌ కుమార్‌ అనే వ్యక్తి దిల్లీ హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు.

ఈ కేసును జస్టిస్‌ నవీన్‌ చావ్లా ఏక సభ్య ధర్మాసనం విచారణకు స్వీకరించింది. ఈ ఫిర్యాదుపై స్పందించాల్సిందిగా ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖకు ఆదేశాలు జారీచేసింది. ఆ వ్యక్తి ఆరోపణలు నిజమైతే మూడురోజుల్లోగా ఫేస్‌బుక్‌, ట్విటర్‌, గూగుల్‌లకు అవసరమైన సూచనలు చేయాల్సిందిగా ధర్మాసనం ఆదేశించింది. ఆ చిత్రం ఎవరిది అనే విషయాన్ని అలా ఉంచితే.. అత్యాచార బాధితురాలి వివరాలను బహిర్గతం చేయటం చట్ట ప్రకారం నేరమని కోర్టు వెల్లడించింది. కాగా, ఈ కేసు తదుపరి విచారణను నవంబరు 9కి వాయిదా వేసింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని