టెన్నిస్‌ బంతుల్లో గంజాయి.. జైల్లోకి విసరబోయి!

జైల్లో ఉన్న తమ సహచరులకు మాదకద్రవ్యాలను అందించేందుకు వినూత్న మార్గాన్ని ఎంచుకున్న నలుగురు వ్యక్తులు పోలీసులకు అడ్డంగా బుక్కయ్యారు. గంజాయి నింపిన టెన్నిస్‌ బంతులతో జైలు ఆవరణలో పోలీసులకు దొరికి కటకటాల పాలయ్యారు.

Published : 12 Nov 2020 17:45 IST

పుణె: జైల్లో ఉన్న తమ సహచరులకు మాదకద్రవ్యాలను అందించేందుకు వినూత్న మార్గాన్ని ఎంచుకున్న నలుగురు వ్యక్తులు పోలీసులకు అడ్డంగా బుక్కయ్యారు. గంజాయి నింపిన టెన్నిస్‌ బంతులతో జైలు ఆవరణలో పోలీసులకు దొరికి కటకటాల పాలయ్యారు. ఈ ఘటన మహారాష్ట్రలోని కొల్హాపూర్‌ జిల్లాలోని కలంబ జైలు పరిసరాల్లో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. జైలు పరిసరాల్లో సిబ్బంది బుధవారం గస్తీ నిర్వహిస్తుండగా.. నలుగురు వ్యక్తులు చేతిలో టెన్నిస్‌ బంతులు పట్టుకుని అనుమానాస్పదంగా కనిపించారు. పోలీసులు వారిని ప్రశ్నించగా పొంతన లేని సమాధానాలు ఇచ్చారు. దీంతో వారిని అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టగా.. వారి వద్ద ఉన్న బంతుల్లో గంజాయి నింపుకొని ఉండటం చూసి పోలీసులు ఆశ్చర్యపోయారు. నిందితులు వాటిని జైలులో ఉన్న తమ స్నేహితులకు పంపే ప్రయత్నం చేసినట్లు పోలీసులు వెల్లడించారు. దీంతో ఆ బంతుల్లోని గంజాయిని సీజ్‌ చేసి నిందితుల్ని అరెస్టు చేశారు. అనంతరం వారిపై మాదకద్రవ్యాల చట్టం(ఎన్‌డీపీఎస్‌) కింద కేసు నమోదు చేశారు. కాగా నిందితులు ఇదువరకే జైల్లోని ఖైదీలను మత్తు పదార్థాలు ఏమైనా సరఫరా చేశారా లేదా అనే విషయమై అధికారులు తనిఖీలు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని