హాథ్రస్‌ ఘటనలో షాకింగ్‌ మలుపు!

హాథ్రస్‌ కేసులో కీలక మలుపు. బాధితురాలి కుటుంబ సభ్యులు నిందితుల్లో ఒకరితో అనేక సార్లు ఫోన్‌లో మాట్లాడినట్టు ఉత్తర్‌ప్రదేశ్‌ పోలీసులు వెల్లడించారు. తమ వద్దనున్న కాల్‌ రికార్డుల ప్రకారం మృతురాలి సోదరుడు, నిందితుల్లో......

Published : 08 Oct 2020 02:00 IST

ఆరు నెలల్లో వందకు పైగా ఫోన్‌ కాల్స్..

దిల్లీ: హాథ్రస్‌ కేసులో కీలక మలుపు. బాధితురాలి కుటుంబ సభ్యులు నిందితుల్లో ఒకరితో అనేక సార్లు ఫోన్‌లో మాట్లాడినట్టు ఉత్తర్‌ప్రదేశ్‌ పోలీసులు వెల్లడించారు. తమ వద్దనున్న కాల్‌ రికార్డుల ప్రకారం మృతురాలి సోదరుడు, నిందితుల్లో ఒకరైన సందీప్‌ ఠాకూర్‌ అనే వ్యక్తితో గతేడాది అక్టోబర్‌ నుంచి ఈ ఏడాది మార్చి మధ్య కాలంలో సుమారు 104 సార్లు  ఫోన్‌లో సంభాషించినట్టు వారు వెల్లడించారు. ఈ వివరాల ఆధారంగా బాధితురాలి సోదరుడిని ప్రత్యేక దర్యాప్తు బృందం సభ్యులు ప్రశ్నించారు. అయితే ఈ ఫోన్‌ సంభాషణల గురించి తనకేమీ తెలీదని.. తాను గానీ, తన కుటుంబంలో ఇంకెవరూ గానీ ఎవరితోనూ మాట్లాడలేదని చెప్పారు.

సెప్టెంబర్‌ 14న యూపీలోని హాథ్రస్‌ గ్రామంలో ఓ దళిత యువతిపై దాడి జరగ్గా.. తీవ్ర గాయాల పాలైన బాధితురాలు అదే నెల 29న మృతిచెందిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో సామూహిక అత్యాచారం జరిగిందని బాధితురాలు సహా పలువురు ఆరోపించారు. అయితే అటువంటిదేమీ జరగలేదని, మెడకు తగిలిన గాయం వల్లే ఆమె మరణించిందని పోలీసులు వాదిస్తున్నారు. ఈ ఘటనలో పోలీసులు మృతదేహాన్ని హడావుడిగా దహనం చేయడం విమర్శలకు తావిచ్చింది. అల్లర్లు చెలరేగవచ్చనే నిఘా వర్గాల సమాచారం మేరకే తాము ఈ చర్యకు పాల్పడ్డామని యూపీ పోలీసులు సుప్రీం కోర్టుకు వెల్లడించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని