Updated : 27 Oct 2020 06:28 IST

నాచారం చోరీ కేసులో నేపాలీ ముఠా అరెస్టు

నాచారం: హైదరాబాద్‌లోని నాచారం చోరీ కేసులో నేపాలీ ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. ఇంట్లో పని మనుషులుగా చేరి వృద్ధురాలికి మత్తు మందు ఇచ్చి డబ్బు, బంగారంతో పరారైనట్లు రాచకొండ సీపీ మహేశ్‌ భగవత్‌ వెల్లడించారు. మొత్తం రూ.10 లక్షల నగదు, 19 తులాల బంగారం ఎత్తుకెళ్లారన్నారు. ఈ ముఠాలో ఐదుగురిని అరెస్టు చేసినట్లు తెలిపారు. నిందితులు మాయ, రాజేశ్‌,హేమ్‌ ప్రసాద్‌, నిర్మల్‌, విస్మాసురాన్‌ను అరెస్టు  చేశామని, ప్రధాన నిందితుడు అర్జున్‌తోపాటు మరో ఇద్దర్ని త్వరలోనే పట్టుకుంటామని స్పష్టం చేశారు. నిందితుల నుంచి రూ.7 లక్షల విలువైన సొత్తు స్వాధీనం చేసుకున్నామన్నారు. అర్జున్‌, మాయ భార్యాభర్తలుగా నమ్మించి పనిలో కుదిరినట్లు చెప్పారు. పరారీలో ఉన్న మరో నలుగురు నిందితుల కోసం గాలిస్తున్నట్లు చెప్పారు.
 

Read latest Crime News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని