రూ.40లక్షల విలువైన సెల్‌ఫోన్లు చోరీ

నగర శివారు మియాపూర్‌ ఠాణా పరిధి మదీనాగూడలోని రిలయన్స్‌ డిజిటల్‌ షోరూంలో భారీ చోరీ జరిగింది. సుమారు రూ.40 లక్షల విలువైన సెల్‌ఫోన్లు చోరీకి గురయ్యాయి. ..

Published : 15 Nov 2020 03:46 IST

హైదరాబాద్‌: నగర శివారు మియాపూర్‌ ఠాణా పరిధి మదీనాగూడలోని రిలయన్స్‌ డిజిటల్‌ షోరూంలో భారీ చోరీ జరిగింది. సుమారు రూ.40 లక్షల విలువైన సెల్‌ఫోన్లు చోరీకి గురయ్యాయి. ఉదయం సిబ్బంది షోరూంను తెరిచి లోపలికి వెళ్లి చూడగా సెల్‌ఫోన్లన్నీ చెల్లా చెదురుగా పడి ఉండటాన్ని గమనించిన సిబ్బంది స్థానిక పోలీసులకు సమాచారం అందించింది. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని ఐదు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి నిందితుల కోసం గాలింపు చేపట్టారు. 

చరవాణులతోపాటు ఇతర ఎలక్ట్రికల్‌ వస్తువులు ఏమైనా చోరీకి గురయ్యాయా అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. జాతీయ రహదారి ముందే ఉన్న ఈ దుకాణంలో దీపావళి పండుగ రోజునే చోరీ జరగడం స్థానికంగా చర్చనీయాంశమైంది. దీపావళి పర్వదినాన గిరాకీ ఎక్కువగా ఉన్నప్పటికీ చోరీ నేపథ్యంలో యాజమాన్యం దుకాణాన్ని మూసివేసింది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని