Published : 18/10/2020 03:25 IST

ముగ్గురు పిల్లల్ని చంపి.. పోలీసులకు ఫోన్‌ చేసి!

జ్యూరిచ్‌: ఓ తల్లి తన పిల్లల పట్ల కర్కశత్వాన్ని ప్రదర్శించింది. ముగ్గురు ఆడపిల్లలను బలితీసుకుంది. అనంతరం తానూ ఆత్మహత్య చేసుకోబోతున్నట్లు పోలీసులకు సమాచారం అందించింది. అక్కడకు చేరుకున్న పోలీసులు నిందితురాలిని అదుపులోకి తీసుకున్నారు. హత్యకు గురైన వారిలో 8 నెలల పసికందు కూడా ఉంది. ఆస్ట్రియాలోని వియాన్నాలో ఈ ఘటన చోటుచేసుకుంది. తన ముగ్గురు సంతానాన్ని హత్యచేశానని, తాను కూడా ఆత్మహత్యకు పాల్పడుతున్నానంటూ ఓ 31ఏళ్ల మహిళ శనివారం ఉదయం పోలీసులకు ఫోన్‌చేసింది. దీంతో ఆమె నివసిస్తున్న అపార్ట్‌మెంట్‌కు చేరుకున్న వియన్నా పోలీసులు గాయాలతో ఉన్న మహిళను అదుపులోకి తీసుకున్నారు. తొమ్మిదేళ్లు, మూడేళ్ల వయస్సున్న ఇద్దరు బాలికల మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. కొన ప్రాణాలతో ఉన్న 8 నెలల చిన్నారిని ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ కొద్దిసేపటికే ఆమె మృతిచెందింది. ఘటనకు గల పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉందని పోలీసులు పేర్కొన్నారు. తదుపరి విచారణ జరుతున్నట్లు తెలిపారు.

Read latest Crime News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని