Crime news: సుప్రీంకోర్టు వద్దవ్యక్తి ఆత్మహత్యాయత్నం

దేశ రాజధాని నగరంలోని సుప్రీంకోర్టు బయట ఓ వ్యక్తి ఆత్మహత్యాయత్నానికి పాల్పడటం ఒక్కసారిగా కలకలం రేపింది.....

Updated : 21 Jan 2022 16:27 IST

దిల్లీ: దేశ రాజధాని నగరంలోని సుప్రీంకోర్టు బయట ఓ వ్యక్తి ఆత్మహత్యాయత్నానికి పాల్పడటం కలకలం రేపింది. దాదాపు 50 ఏళ్ల వయసు కలిగిన ఓ వ్యక్తి సర్వోన్నత న్యాయస్థానం వద్ద ఒంటికి నిప్పంటించుకొని ఆత్మహత్యకు ప్రయత్నించినట్టు పోలీసులు వెల్లడించారు. పలుచోట్ల గాయాలు కావడంతో చికిత్స కోసం లోక్‌నాయక్‌ జయప్రకాశ్‌ నారాయణ్‌ (ఎల్‌ఎన్‌జేపీ) ఆస్పత్రికి తరలించారు. అతడిని నోయిడాకు చెందిన రాజ్‌భర్‌ గుప్తాగా గుర్తించినట్టు పోలీసులు తెలిపారు. నోయిడాలోని సెక్టార్‌ 128లో ఓ ఫ్యాక్టరీలో పనిచేస్తున్నట్టు సమాచారం. ఈ ఘటనపై విచారణ కొనసాగుతోంది. అయితే, అతడు ఇంత తీవ్ర నిర్ణయం తీసుకోవడం వెనుక కారణాలు మాత్రం ఇంకా తెలియరాలేదు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని