మధ్యప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం

మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌లో మంగళవారం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ప్యాసింజర్‌ ఆటో, బస్సు ఢీకొన్న ఘటనలో 13 మంది మరణించారు. మరో ముగ్గురు వ్యక్తులు గాయాల పాలయ్యారు.

Updated : 23 Mar 2021 15:06 IST

భోపాల్‌: మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌లో మంగళవారం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఓల్డ్‌ చావ్ని ప్రాంతంలో జరిగిన ఈ ప్రమాదంలో 13 మంది మృతి చెందారు. మృతుల్లో 12 మంది మహిళలు, ఒక పురుషుడు ఉన్నాడని పోలీసులు తెలిపారు. ప్రమాదంలో మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు. బస్సును ఆటో అతి వేగంగా ఢీకొట్టడంతో ప్రమాదం జరిగిందని  పోలీసులు వెల్లడించారు. అంగన్‌ వాడీ కేంద్రంలో వంట చేసేవారు తిరిగి ఇంటికి వెళ్తున్న సమయంలో ఈ ఘటన చోటు చేసుకుందని గ్వాలియర్‌ ఎస్పీ అమిత్‌ సంఘీ తెలిపారు. ప్రమాద స్థలంలోనే 8మంది మహిళలు, ఆటో డ్రైవర్‌ మరణించగా...మిగిలిన వారు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారని ఆయన వివరించారు. ప్రమాదం దాటికి ఆటో నుజ్జునుజ్జవ్వగా.. మృతదేహాలు చెల్లా చెదురుగా పడి ఉన్నాయి.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని