Nepal: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. 28మంది దుర్మరణం

నేపాల్‌లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. బస్సు అదుపుతప్పి లోయలో పడిపోయిన ఘటనలో 28 మంది దుర్మరణం పాలయ్యారు. 12 మందికి పైగా గాయపడ్డారు. వాయువ్య నేపాల్‌లోని ముగు జిల్లాలో మంగళవారం మధ్యాహ్నం ఈ ప్రమాదం జరిగినట్లు...

Published : 12 Oct 2021 22:18 IST

ఖాఠ్‌మండూ: నేపాల్‌లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. బస్సు అదుపుతప్పి లోయలో పడిపోయిన ఘటనలో 28 మంది దుర్మరణం చెందారు. 12 మందికి పైగా గాయపడ్డారు. వాయువ్య నేపాల్‌లోని ముగు జిల్లాలో మంగళవారం మధ్యాహ్నం ఈ ప్రమాదం జరిగినట్లు అధికారులు వెల్లడించారు. బస్సు నేపాల్‌గంజ్‌ నుంచి ముగు ప్రాంతానికి వెళ్తోంది. మార్గమధ్యలో ముందు టైరు పంక్చర్‌ కావడంతో అదుపుతప్పి లోయలో పడిపోయింది. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో 45 మంది వరకు ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం. వీరిలో ఎక్కువమంది స్థానికంగా దశయన్‌ పండగ కోసం వెళ్తున్నవారే.

ఈ ప్రమాద విషయం తెలుసుకున్న వెంటనే అధికారులు ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. 28 మంది మృతదేహాలను వెలికితీశారు. పర్వత ప్రాంతం కావడంతో క్షతగాత్రులను హెలికాప్టర్ల సాయంతో ఆసుపత్రులకు తరలించారు. మరోవైపు, మృతుల గుర్తింపు ప్రక్రియ కొనసాగుతోంది. చాలావరకు పర్వత ప్రాంతమైన నేపాల్‌లో తరచూ రోడ్డు ప్రమాదాలు జరుగుతుంటాయి. ప్రభుత్వ గణాంకాల ప్రకారం 2019లో దాదాపు 13 వేల రోడ్డు ప్రమాదాలు జరగ్గా.. 2500 మందికి పైగా మృతి చెందారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని