Published : 25/06/2021 16:40 IST

Fake Vaccine: 2వేల మందికి ఉప్పు నీటి వ్యాక్సిన్లు!

ముంబయి: దేశ వాణిజ్య రాజధాని ముంబయిలో బయటపడ్డ నకిలీ కొవిడ్‌ టీకా శిబిరాల బాధితులు దాదాపు 2 వేల మందికి పైగా ఉంటారని అధికారులు తేల్చారు. ఈ క్యాంపులపై ఏడు ఎఫ్‌ఐఆర్‌లు నమోదవగా, ఓ మహిళ సహా ఎనిమిది మందిని పోలీసులు అరెస్టు చేశారు. కాగా బాధితులకు ఈ ముఠా సెలైన్‌ లేదా ఉప్పునీటి వ్యాక్సిన్లు ఇచ్చినట్లు అధికారులు భావిస్తున్నారు. ‘ముంబయిలో మొత్తంగా 9 నకిలీ టీకా క్యాంపులు జరిగినట్లు గుర్తించాం. ఆ క్యాంపులను ఎనిమిది మంది సభ్యుల ముఠానే నిర్వహించింది. వారందరినీ అరెస్టు చేశాం. వారి వద్ద నుంచి రూ.12.40 లక్షలు స్వాధీనం చేసుకున్నాం. ప్రధాన నిందితులైన మనీష్ త్రిపాఠి, మహేంద్రసింగ్ బ్యాంక్ ఖాతాలు స్తంభింపజేశాం’ అని జాయింట్ పోలీస్ కమిషనర్ (లా అండ్ ఆర్డర్‌)విశ్వస్ నంగ్రే పాటిల్ వెల్లడించారు. టీకాలు ఇచ్చేందుకు ముఠా వినియోగించిన కొవిషీల్డ్‌ వయల్స్‌ను గుజరాత్‌ నుంచి సేకరించారని.. వాస్తవంగా వాటిలో ఏమి నింపారో స్పష్టంగా చెప్పలేమని పోలీసు వర్గాలు పేర్కొన్నాయి.

ముంబయిలోని కాందీవలిలో ఉన్న ఓ హౌసింగ్ సొసైటీలో గత వారం 390 మందికి టీకాలు వేశారు. కాగా వారిలో ఎవరికీ టీకా తీసుకున్న తర్వాత వచ్చే లక్షణాలు కనిపించలేదు. దీనికితోడు పలు ఆసుపత్రుల నుంచి టీకా వేసుకున్నట్లు సర్టిఫికెట్లు వచ్చాయి. దీంతో అనుమానం వ్యక్తం చేసిన ఆ హౌసింగ్ సొసైటీ సభ్యులు సంబంధిత ఆసుపత్రులకు ఫోన్లు చేశారు. అయితే ఆ వ్యాక్సిన్లు వేసింది తాము కాదని ఆ ఆసుపత్రుల యాజమాన్యాలు చెప్పడంతో  వారు పోలీసులను ఆశ్రయించారు. దీంతో ఈ ముఠా వ్యవహారం వెలుగులోకి వచ్చింది.  ముంబయిలోని మరో ఎనిమిది ప్రాంతాల్లోనూ వీరు నకిలీ టీకా శిబిరాలు నిర్వహించినట్లు పోలీసులు గుర్తించారు.

Read latest Crime News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని