
నిర్మాణంలో ఉన్న కలెక్టర్ కార్యాలయం వద్ద అపశ్రుతి
సెంట్రింగ్ కూలి 9 మందికి గాయాలు
మహబూబాబాద్: మహబూబాబాద్ జిల్లా సాలార్ తండా సమీపంలో నిర్మాణంలోని కలెక్టర్ కార్యాలయం వద్ద అపశ్రుతి చోటుచేసుకుంది. సెంట్రింగ్ కూలడంతో 9 మంది కార్మికులు గాయపడ్డారు. బాధితులను మహబూబాబాద్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. సెంట్రింగ్ కింద ఉన్న రెండు జాకీలు విరగడంతో ప్రమాదం జరిగింది.
కలెక్టరేట్ ముందు, వెనుక భవనాలకు మధ్యలో కారిడార్ కోసం శ్లాబ్ వేస్తుండగా ప్రమాదం చోటుచేసుకుంది. పశ్చిమబెంగాల్, ఝార్ఖండ్ రాష్ట్రాలతో పాటు నెల్లూరు జిల్లాకు చెందిన మొత్తం 125 మంది కార్మికులు ఈ నిర్మాణ పనుల్లో పనిచేస్తు్న్నారు. ఇద్దరికి తీవ్రగాయాలు కాగా.. ఏడుగురు స్వల్పంగా గాయపడ్డారు. రెండు భవనాల మధ్య దూరం ఎక్కువగా ఉండటం.. మధ్యలో పిల్లర్లు లేకపోవడంతోనే ప్రమాదం జరిగి ఉండొచ్చని మున్సిపల్ ఛైర్మన్ రామ్మోహన్‌రెడ్డి అభిప్రాయపడ్డారు.
ఇవీ చదవండి
Advertisement