Jharkhand: హెడ్‌మాస్టర్‌ని చితకబాదిన గ్రామస్థులు..

ఝార్ఖండ్ లో సహోద్యోగినిపై లైంగిక వేధింపులకు పాల్పడిన ఓ ప్రధానోపాధ్యాయుడికి గ్రామస్థులు దేహశుద్ధి చేశారు. ఏకంగా అతడి మెడలో చెప్పులు, బూట్ల దండలు వేసి గ్రామంలో ఊరేగించారు. ఝార్ఖండ్ లోని పశ్చిమ సింగ్ భూమ్ జిల్లా బాచ్ మగుతు ప్రభుత్వ పాఠశాలలో పనిచేస్తున్న మహిళా ఉపాధ్యాయినిని  ప్రధానోపాధ్యాయుడు రమేశ్ చంద్ర తరచూ వేధించేవారని గ్రామస్థులు తెలిపారు.

Published : 15 Aug 2021 02:02 IST

రాంచీ: ఝార్ఖండ్‌లో సహోద్యోగినిపై లైంగిక వేధింపులకు పాల్పడిన ఓ ప్రధానోపాధ్యాయుడికి గ్రామస్థులు దేహశుద్ధి చేశారు. అతడి మెడలో చెప్పులు, బూట్ల దండలు వేసి గ్రామంలో ఊరేగించారు. రాష్ట్రంలోని పశ్చిమ సింగ్ భూమ్ జిల్లా బాచ్ మగుతు ప్రభుత్వ పాఠశాలలో పనిచేస్తున్న మహిళా ఉపాధ్యాయినిని ప్రధానోపాధ్యాయుడు రమేశ్ చంద్ర తరచూ వేధించేవాడని గ్రామస్థులు తెలిపారు. పాఠశాలలో తన నియామకం చట్టవిరుద్ధమని శారీరకంగానూ వేధింపులకు గురి చేసేవాడని సదరు ఉపాధ్యాయురాలు ఆరోపిస్తోంది. అయితే తనపై వస్తున్న ఆరోపణలను రమేశ్ చంద్ర ఖండించారు. విచారణలో నిజాలు బయటపడతాయని తెలిపారు. ప్రస్తుతం అతడికి దేహశుద్ధి చేసిన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని