రూ.15.7 లక్షల విదేశీ కరెన్సీ పట్టివేత

కేరళలోని కోలికోడ్‌ విమానాశ్రయంలో ఓ వ్యక్తి వద్ద నుంచి అధికారులు..

Published : 14 Sep 2020 01:02 IST

(ఫొటో: కస్టమ్స్‌ కమిషనరేట్‌ ట్విటర్‌ పేజీ)

కొచ్చి: కేరళలోని కోలికోడ్‌ విమానాశ్రయంలో ఓ వ్యక్తి వద్ద నుంచి అధికారులు పెద్ద మొత్తంలో విదేశీ నోట్లను స్వాధీనం చేసుకున్నారు. దుబాయ్‌కి వెళ్లనున్న ఓ వ్యక్తి వద్ద నుంచి రూ.15.7 లక్షలు విలువచేసే  కరెన్సీ నోట్లను స్వాధీనం చేసుకున్నట్లు విమానాశ్రయ అధికారులు తెలిపారు. కాగా అవి పలు దేశాలకు చెందిన (71,150 సౌదీ రియాల్‌, 10,232 యూఏఈ దిరమ్‌, 800 ఖతార్‌ రియాల్‌, 210 ఒమన్‌ రియాల్‌) కరెన్సీ కావడం గమనార్హం. అతడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని