
Updated : 18 Jan 2022 14:07 IST
TS News: పోలీసుల కాల్పుల్లో నలుగురుమావోయిస్టుల మృతి
ములుగు: ములుగు జిల్లాలో పోలీసులు, మావోయిస్టులకు మధ్య ఈ ఉదయం ఎదురుకాల్పులు జరిగాయి. వెంకటాపురం మండలం కర్రెగుట్ట అటవీ ప్రాంతంలో జరిగిన కాల్పుల్లో నలుగురు మావోయిస్టులు మృతి చెందారు. మావోయిస్టుల కాల్పుల్లో గ్రేహౌండ్స్ కానిస్టేబుల్‌కు గాయాలయ్యాయి. కానిస్టేబుల్‌ను హెలికాఫ్టర్‌లో అధికారులు హనుమకొండ తరలించారు. మావోయిస్టులు తమకు తారసపడటంతో కాల్పులు జరిపినట్లు పోలీసులు వెల్లడించారు. కర్రెగుట్ట అటవీప్రాంతంలో కూంబింగ్ కొనసాగుతోంది.
Tags :