Maharashtra: ప్రేమ కోసం ప్రియుడి మాటలు నమ్మి.. లింగమార్పిడి చేసుకున్న వ్యక్తి!

ప్రేమ కోసం ఏకంగా లింగ మార్పిడి చేసుకున్న వ్యక్తిని ప్రియుడు మోసం చేసిన సంఘటన ముంబయిలో వెలుగుచూసింది. నగరానికి చెందిన జమాల్‌ షేక్‌(31) అనే వ్యక్తి.. ఫుర్‌ఖాన్‌ అనే వ్యక్తిని ప్రేమించాడు.

Published : 14 Nov 2021 01:32 IST

ముంబయి: ప్రేమ కోసం ఏకంగా లింగ మార్పిడి చేసుకున్న వ్యక్తిని ప్రియుడు మోసం చేసిన ఘటన ముంబయిలో వెలుగుచూసింది. నగరానికి చెందిన జమాల్‌ షేక్‌(31) అనే వ్యక్తి.. ఫుర్‌ఖాన్‌ అనే వ్యక్తిని ప్రేమించాడు. ప్రేమ కోసం, ప్రియుడి కోరిక మేరకు జమాల్‌.. లింగమార్పిడి చేసేకొని శిల్పగా మారాడు. 16 ఏళ్ల క్రితం కోల్‌కతా నుంచి ముంబయికి వచ్చి స్థిరపడిన  జమాల్.. ఏడాదిన్నర క్రితం ఫుర్‌ఖాన్‌తో ప్రేమలో పడ్డాడు. లింగ మార్పిడి చేసుకుంటే.. ఎంతో ప్రేమగా చూసుకుంటానని ఫుర్‌ఖాన్‌.. జమాల్‌ను నమ్మించాడు. ఆ మాటలను నమ్మిన జమాల్‌.. రూ.2 లక్షలు వెచ్చించి లింగ మార్పిడి శస్త్రచికిత్స చేయించుకున్నాడు. అయితే ఫుర్‌ఖాన్‌ తనను మోసగించి దిల్లీకి పారిపోయాడని అతడు ఆవేదన వ్యక్తం చేశాడు. అతడికి అవసరమున్న ప్రతిసారి డబ్బు ఇచ్చినట్టు తెలిపాడు. ఫుర్‌ఖాన్‌కు ఇంతకుముందే వివాహం జరిగినా.. తనను ప్రేమించానని చెప్పడంతో నమ్మి మోసపోయినట్టు జమాల్ తెలిపాడు. తల్లిదండ్రులు కూడా తనను స్వీకరించలేకపోతున్నారని వివరించాడు. న్యాయం కోసం పోలీసులను ఆశ్రయించినా.. కేసు నమోదు చేయడం లేదని జమాల్ ఆవేదన వ్యక్తం చేశాడు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని