Updated : 13/01/2020 01:40 IST

బాంబు బెదిరింపు..విమానం  ల్యాండింగ్‌

కోల్‌కతా:  కోల్‌కతా నుంచి ముంబయికి బయల్దేరిన ఓ విమానం గంట సేపటి తర్వాత అక్కడికే వచ్చి ఆదివారం అత్యవసరంగా ల్యాండ్ అయింది. విమానంలో ప్రయాణిస్తున్న ఓ యువతి తన శరీరానికి బాంబులు ఉన్నాయని సిబ్బందికి తెలియజేయడంతో పైలట్లు అప్రమత్తమై విమానాన్ని వెనక్కి మళ్లించారు. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. ఎయిర్‌ ఏసియాకు చెందిన విమానం (15316) ఆదివారం ఉదయం 9.57గంటలకు కోల్‌కతా నుంచి ముంబయికి బయల్దేరింది. గాల్లోకి ఎగిరిన గంట సమయం తర్వాత అందులో ప్రయాణిస్తున్న మోహినీ మొండాల్‌ (25) అనే యువతి ఒక నోట్‌ రాసి కేబిన్‌ సిబ్బందికి ఇచ్చారు. అనంతరం దాన్ని విమాన కెప్టెన్‌ ఇవ్వమని సిబ్బందికి సూచించారు. ఆ నోట్‌లో ఆమె ‘తన శరీరానికి బాంబులు అమర్చినట్లు.. వాటిని ఆమె ఏ క్షణంలోనైనా పేల్చవచ్చు’ అని తెలియజేసినట్లు పైలట్లు ఎయిర్‌ ట్రాఫిక్‌ కంట్రోలర్‌కు(ఏటీసీ) తెలియజేసి విమానాన్ని వెనక్కి మళ్లించారు. అప్పటికే విమానాశ్రయంలో అప్రమత్తమైన అధికారులు 11.46 గంటలకు దూర ప్రాంతానికి తీసుకెళ్లారు. అనంతరం సీఐఎస్‌ఎఫ్‌ అధికారులు తనిఖీలు నిర్వహించి ఆ యువతిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఘటనపై అన్ని పకడ్బందీ చర్యలు తీసుకున్నామని వారు వివరణ ఇచ్చారు. 

Read latest Crime News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని