Published : 16/01/2020 04:53 IST

కోడిపందేల్లో విషాదం!

చింతలపూడి గ్రామీణం: సంక్రాంతిని పురస్కరించుకుని నిర్వహించిన కోడిపందేల్లో విషాదం చోటుచేసుకుంది. కోడికత్తి తగిలి ఒకరు మృతిచెందారు. ఈ ఘటన పశ్చిమగోదావరి జిల్లా చింతలపూడి మండలం ప్రగడవరంలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే పండగ సందర్భంగా గ్రామానికి సమీపంలోని పామాయిల్‌ తోటల్లో కోడిపందేలు నిర్వహించారు. కోళ్ల కాళ్లకు కత్తులు కడుతుండగా సరిపల్లి వెంకటేశ్వరరావు (55) అనే వ్యక్తి అక్కడ నిలబడి ఉన్నారు.

ఈ క్రమంలో ఓ కోడిపుంజు ఒక్కసారిగా కాళ్లు విదిలించడంతో పక్కనే ఉన్న వెంకటేశ్వరరావు తొడభాగంలో కత్తి గుచ్చుకుంది. దీంతో బాగా రక్తస్రావం జరగడంతో ఆయన అక్కడే కుప్పకూలిపోయారు. అక్కడ ఉన్నవారు వెంటనే స్పందించి హుటాహుటిన చింతలపూడి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. వెంకటేశ్వరరావును పరిశీలించిన వైద్యులు.. అప్పటికే మృతిచెందినట్లు ప్రకటించారు. సమాచారం అందించడంతో పోలీసులు ఆస్పత్రికి వచ్చి వెంకటేశ్వరావు మృతదేహాన్ని పరిశీలించారు.

Read latest Crime News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని