ఉరితాడైన ఊయల

పిల్లలు సరదాగా ఆడుకుంటారని భావించి ఇంట్లో కట్టిన ఊయల పదేళ్ల బాలుడి పాలిట ఉరితాడుగా మారింది. సిద్దిపేట జిల్లా జగదేవపూర్‌ మండలం లింగారెడ్డిపల్లిలో ఈ ఘటన చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన బీమరి నర్సింలు, కనకమ్మ

Published : 15 May 2020 01:56 IST

  మెడకు బిగుసుకుని పదేళ్ల బాలుడి మృతి

జగదేవపూర్‌ : పిల్లలు సరదాగా ఆడుకుంటారని భావించి ఇంట్లో కట్టిన ఊయల పదేళ్ల బాలుడి పాలిట ఉరితాడుగా మారింది. సిద్దిపేట జిల్లా జగదేవపూర్‌ మండలం లింగారెడ్డిపల్లిలో ఈ ఘటన చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన బీమరి నర్సింలు, కనకమ్మ దంపతులకు రేవంత్‌, లహరిక సంతానం. చిన్నారులు ఆడుకునేందుకు ఇంట్లో దూలానికి కొన్నిరోజుల క్రితం చీరతో ఊయల కట్టారు. రోజూమాదిరిగానే తల్లిదండ్రులు వ్యవసాయ పనుల నిమిత్తం పొలం వద్దకు వెళ్లారు. బుధవారం సాయంత్రం రేవంత్‌(10) ఊయల ఎక్కి ఒక్కడే ఆడుకుంటున్నాడు. అదే సమయంలో గేదెలకు నీరు పెట్టేందుకు బాలుడి తాత లక్ష్మయ్య పొలం వద్ద నుంచి ఇంటికి చేరుకున్నాడు. ఈ క్రమంలో ఊయలకు రేవంత్‌ మృతదేహం వేలాడుతూ ఉండటాన్ని గమనించాడు. బోరున విలపిస్తూ తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చాడు. ఊయల నుంచి జారిపడటంతో బాలుడి మెడకు బిగుసుకొని ఉంటుందని గ్రామస్థులు భావిస్తున్నారు. ఈ ఘటనపై ఎవరూ ఫిర్యాదు చేయలేదని ఎస్సై సాయిరాం చెప్పారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని