
Updated : 15 Jun 2020 19:49 IST
బిహార్లో రోడ్డు ప్రమాదం.. ఏడుగురి మృతి
గయ: బిహార్లో జరిగిన ఓ రోడ్డు ప్రమాదంలో ఏడుగురు మరణించగా, 12 మంది గాయపడ్డారు. ఈ దుర్ఘటన గయ జిల్లా, అమాస్ గ్రామం వద్ద చోటుచేసుకుంది. రహదారిపై ప్రయాణిస్తున్న రెండు ఆటోలను అటుగా వస్తున్న ఓ ట్రక్కు ఢీకొట్టడంతో ఈ ప్రమాదం సంభవించింది. క్షతగాత్రులను సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
Tags :