బైక్‌ కవర్‌లోని శానిటైజర్‌కు మంటలు...

శానిటైజర్‌ బాటిల్‌ నుంచి మంటలు రేగిన ఘటన రాజమహేంద్రవరంలో జరిగింది. దేవీచౌక్ సెంటర్‌లో ఓ దుకాణం ముందు పార్కింగ్ ప్రదేశంలో ఈ ఘటన జరిగింది. ద్విచక్ర వాహనంలో ట్యాంక్‌ కవర్‌లో ఉన్న శానిటైజర్‌ నుంచి ఒక్కసారిగా మంటలు వచ్చాయి. క్షణాల్లో ఆ

Updated : 14 Sep 2023 15:40 IST

రాజమహేంద్రవరం: 

శానిటైజర్‌ బాటిల్‌ నుంచి మంటలు రేగిన ఘటన రాజమహేంద్రవరంలో జరిగింది. దేవీచౌక్ సెంటర్‌లో ఓ దుకాణం ముందు పార్కింగ్ ప్రదేశంలో ఈ ఘటన జరిగింది. ద్విచక్ర వాహనంలో ట్యాంక్‌ కవర్‌లో ఉన్న శానిటైజర్‌ నుంచి ఒక్కసారిగా మంటలు వచ్చాయి. క్షణాల్లో ఆ మంటలు బండి ముందు భాగమంతా వ్యాపించాయి. దీంతో పరిసర ప్రాంతాల ప్రజల భయాందోళనకు గురయ్యారు. స్థానికుల సహకారంతో వాహనం యజమాని మంటల్ని అదుపు చేయడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. 

 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని