Crime News: పోలీసును కిడ్నాప్‌ చేసిన దొంగ

ఉత్తర్‌ప్రదేశ్‌లోని గ్రేటర్‌ నోయిడాలో ఓ వ్యక్తి దుస్సాహసం చేశాడు. కారు పత్రాలు చూపించాలని, ఆపిన ఓ ట్రాఫిక్‌ పోలీసునే అపహరించాడు...

Published : 20 Oct 2021 16:16 IST

ఉత్తర్‌ప్రదేశ్‌లోని గ్రేటర్‌ నోయిడాలో ఓ వ్యక్తి దుస్సాహసం చేశాడు. కారు పత్రాలు చూపించాలని, ఆపిన ఓ ట్రాఫిక్‌ పోలీసునే అపహరించాడు. కారులో కానిస్టేబుల్‌ను తీసుకెళ్లి పది కిలోమీటర్ల దూరంలో వదిలేశాడు. ఈ కేసులో నిందితుడ్ని పోలీసులు అరెస్టు చేశారు.గ్రేటర్‌ నొయిడా పరిధిలోని ఘోది బచేదా గ్రామానికి చెందిన సచిన్‌ రావల్‌.. హరియాణాలోని గురుగ్రామ్‌లో ఓ కారు షోరూం నుంచి మారుతీ స్విఫ్ట్‌ డిజైర్‌ కారును రెండేళ్ల క్రితం దొంగిలించాడు. తన గ్రామానికే చెందిన మరో వ్యక్తి కారు నంబర్‌తో నకిలీ నంబర్‌ ప్లేట్‌ చేయించి రావల్‌ ఆ కారును  నడుపుతున్నాడు. ఆదివారం ఉదయం.. సూరజ్‌పుర్‌లో ట్రాఫిక్‌ పోలీసులు చెకింగ్‌ క్యాంపెయిన్‌ ఏర్పాటు చేశారు. అక్కడ రావల్‌ కారును పోలీసులు ఆపారు. కారు పత్రాలు చూపించాలని కానిస్టేబుల్‌ వీరేంద్ర సింగ్‌ అడిగాడు. తన మొబైల్‌ ఫోన్లో వాటి సాఫ్ట్‌ కాపీస్‌ ఉన్నాయని రావల్‌ చెప్పాడు. వాటిని చూసేందుకు కారులోకి ఎక్కాలని కానిస్టేబుల్‌ను కోరాడు. కారులోకి ఎక్కిన వెంటనే.. కారు డోర్లు లాక్‌ చేసి, అతడు దూసుకెళ్లాడు. అజయాబ్‌పుర్‌ పోలీస్‌ చౌకి ప్రాంతంలో వీరేంద్ర సింగ్‌ను దింపేసి పరారయ్యాడు. సోమవారం నిందితుడ్ని అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని