
Published : 21 Oct 2021 12:12 IST
Crime News: కాళ్లు నరికి కడియాలు దొంగలించారు
జైపుర్లో మహిళ దారుణహత్య..
ఈనాడు, జైపుర్: రాజస్థాన్లో దారుణ హత్య జరిగింది. 55 ఏళ్ల మహిళను కిరాతకంగా హత్యచేశారు. అంతేకాకుండా ఆమె కాళ్లు నరికేసి, వాటికున్న వెండి కడియాలు దొంగిలించారు. జైపుర్లోని జామ్ వార్ముగఢ్లో మంగళవారం ఈ దారుణం జరిగింది. ఆమె మృతదేహం లభ్యమైన చోటే బుధవారం కుటుంబసభ్యులు ఆందోళన నిర్వహించారు.
గ్రామస్థులు కూడా వారికి మద్దతుగా నిలిచారు. గ్రామానికి చేరుకున్న కలెక్టర్ మృతురాలి కుటుంబానికి రూ.8 లక్షల పరిహారం అందేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.
Tags :