
Published : 28 Oct 2021 10:31 IST
Gang Rape: తుపాకీతో బెదిరించి మహిళపై సామూహిక అత్యాచారం
ఉత్తర్‌ప్రదేశ్‌లో అత్యంత పాశవిక ఘటన వెలుగు చూసింది. ఇంట్లో ఒంటరిగా ఉన్న ఓ మహిళను తుపాకీతో బెదిరించి నలుగురు యువకులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. జాలౌన్ జిల్లా ఉరయ్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని గ్రామంలో.. ఓ మహిళ తన పిల్లలతో కలిసి ఇంట్లో ఉంది. ఆ సమయంలో నలుగురు యువకులు.. గోడ దూకి, ఇంట్లోకి ప్రవేశించారు. ఒంటరిగా ఉన్న ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డారు. సదరు మహిళ అరిచేందుకు ప్రయత్నించగా ఆమెపై తుపాకీ గురిపెట్టి బెదిరించారు. అనంతరం అక్కడి నుంచి పరారయ్యారని పోలీసులు తెలిపారు.
Tags :