Suicide: రూ.6 వేలకోసం భార్యాభర్తల ఆత్మహత్య
ఇంట్లో దాచిన సొమ్ము కనిపించడం లేదని గొడవపడిన భార్యాభర్తలు క్షణికావేశంలో ఆత్మహత్య చేసుకున్నారు. ఈ విషాద ఘటన కామారెడ్డి పట్టణంలోని గోసంగికాలనీలో చోటుచేసుకుంది. పట్టణ సీఐ మధుసూదన్ కథనం ప్రకారం..
కోదండం సాయిలు, పోచవ్వ
కామారెడ్డి నేరవిభాగం, న్యూస్‌టుడే: ఇంట్లో దాచిన సొమ్ము కనిపించడం లేదని గొడవపడిన భార్యాభర్తలు క్షణికావేశంలో ఆత్మహత్య చేసుకున్నారు. ఈ విషాద ఘటన కామారెడ్డి పట్టణంలోని గోసంగికాలనీలో చోటుచేసుకుంది. పట్టణ సీఐ మధుసూదన్ కథనం ప్రకారం.. కోదండం సాయిలు (45), పోచవ్వ (42) భార్యాభర్తలు. కూలి పనులు చేసుకుని బతుకుతుంటారు. సాయిలుకు ఆమె మూడో భార్య. వీరికి సంతానం లేదు. మొదటి ఇద్దరు భార్యలు అనారోగ్యంతో మృతి చెందారు. అక్టోబరు 27న ఇంట్లో ఉంచిన రూ. 6 వేలు కనిపించడం లేదని భార్యాభర్తలు ఘర్షణ పడ్డారు. మర్నాడూ ఇదే విషయమై పోట్లాడుకున్నారు. మనస్తాపం చెందిన పోచవ్వ ఇంట్లోంచి వెళ్లిపోయింది. అదేరోజు సాయంత్రం సాయిలు ఇంటి నుంచి బయటకు వెళ్లాడు. ఆదివారం ఉదయం గోసంగి కాలనీ సమీపంలోని చర్చి వెనకాల రెండు మృతదేహాలు ఉన్నట్లు సమాచారం అందడంతో బంధువులు వెళ్లిచూశారు. సాయిలు మృతదేహం సగం కాలిపోయి ఉండగా, సమీపంలోని నీటి కుంటలో పోచవ్వ మృతదేహాన్ని గుర్తించారు. సాయిలు నిప్పంటించుకొని చనిపోయాడని, పోచవ్వ కుంటలో దూకి ఆత్మహత్య చేసుకుందని సీఐ తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నకిలీ కరెన్సీ నోట్లతో దొరికిన వైకాపా నేత బంధువు
వైకాపా నేత బావమరిది నకిలీ కరెన్సీ నోట్లతో ప్రభుత్వ మద్యం దుకాణంలో మద్యం కొనుగోలు చేయబోయి అక్కడి సిబ్బందికి దొరికిపోయాడు. -
రేటింగుల పేరుతో మోసం కేసులో రూ.32 కోట్ల జప్తు
పర్యాటక ప్రాంతాల్లో హోటళ్లు, రిసార్టులకు రేటింగ్ ఇస్తే మంచి కమీషన్ ముట్టజెబుతామని భారీ మోసానికి పాల్పడిన కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) అధికారులు దేశవ్యాప్తంగా 580 బ్యాంకు ఖాతాల్లో ఉన్న రూ.32.34 కోట్ల నగదును జప్తు చేశారు. -
ట్యాపింగ్ పాపంలో కీలక వికెట్
ఫోన్‌ట్యాపింగ్ వ్యవహారంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. హైదరాబాద్ టాస్క్‌ఫోర్స్ డీసీపీగా, ఉద్యోగ విరమణ అనంతరం అక్కడే ఓఎస్డీగా సుదీర్ఘకాలం పనిచేసిన రాధాకిషన్‌రావును పోలీసులు అరెస్ట్ చేశారు. -
రొయ్యల ప్రాసెసింగ్ కంపెనీలో తనిఖీలు
బాపట్ల జిల్లా చీరాల మండలం కావూరివారిపాలెం పంచాయతీ పరిధిలో ఉన్న రాయల్ మెరైన్ రొయ్యల ప్రాసెసింగ్ కంపెనీలో గురువారం పలు శాఖల అధికారులు తనిఖీలు చేపట్టారు. -
ముంబయిలో రూ.6 కోట్ల డ్రగ్స్ స్వాధీనం
మహారాష్ట్ర రాజధాని ముంబయిలో పోలీసులు వేర్వేరు ప్రాంతాల్లో సోదాలు నిర్వహించి నలుగురు వ్యక్తుల నుంచి 3 కిలోల మెఫెడ్రోన్‌ను స్వాధీనం చేసుకున్నారు. -
పరీక్షలో జవాబు పత్రం చూపించలేదని ఘోరం
పదో తరగతి పరీక్షలో తమకు జవాబు పత్రం చూపించలేదన్న ఆగ్రహంతో ఓ విద్యార్థిపై ముగ్గురు సహచర విద్యార్థులు తీవ్రంగా దాడి చేసి కత్తితో గాయపరిచిన ఘటన మహారాష్ట్రలో చోటుచేసుకుంది. -
అయిదేళ్ల బాలికపై హత్యాచారం.. నిందితుడి అరెస్టు
దేశ రాజధానిలో దిల్లీలో ఘోరం చోటుచేసుకుంది. అయిదేళ్ల చిన్నారిపై ఓ ఫ్యాక్టరీ కార్మికుడు అత్యాచారానికి పాల్పడి హతమార్చాడు. -
గ్రూప్-1 ఉద్యోగాల పేరిట టోకరా.. పోలీసుల అదుపులో నిందితుడు
‘గ్రూప్-1’ ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ భారీగా డబ్బులు వసూలు చేసి మోసగించిన ముఠాలో ఓ నిందితుడిని వరంగల్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. -
కోటాలో నీట్ విద్యార్థిని ఆత్మహత్య
రాజస్థాన్‌లో పోటీ పరీక్షల శిక్షణ సంస్థలకు నెలవైన కోటాలో విద్యార్థుల ఆత్మహత్యలు ఆగడం లేదు. -
ఛత్తీస్‌గఢ్ అడవుల్లో భారీగా ఎదురుకాల్పులు
మహారాష్ట్ర-ఛత్తీస్‌గఢ్ సరిహద్దున కాంకర్ అడవుల్లో పోలీసులు, మావోయిస్టులకు మధ్య బుధ, గురువారాల్లో భారీగా ఎదురుకాల్పులు జరిగాయి. -
మర్మాంగంలోకి ఎయిర్ బ్లోయర్ నాజిల్.. యువకుడు మృతి
ఎయిర్ బ్లోయర్ నాజిల్‌ను మర్మాంగంలోకి చొప్పించడంతో ఓ యువకుడు ప్రాణాలు కోల్పోయాడు.
తాజా వార్తలు (Latest News)
-
ప్రధాని మోదీ, బిల్‌గేట్స్.. ‘చాయ్ పే చర్చ’
-
‘మిలిటరీ తరహా కోచ్’ అంటూ వీజ్ వ్యాఖ్యలు.. ఆండ్రి రస్సెల్ కౌంటర్
-
నిన్న అమెరికా, నేడు ఐరాస.. భారత అంతర్గత వ్యవహారాలపై వ్యాఖ్యలు!
-
మేనల్లుడికి అత్యున్నతాధికారి నజరానా!
-
ముఖ్యమంత్రితో ముఖాముఖిలో వాలంటీరు
-
కేరళలోనూ రియాన్ గురించే అడిగేవారు.. ఇప్పుడు 15 మంది కీలకమే: సంజూ