Cyber Crime: పెళ్లి పేరుతో రూ.17.89 లక్షలు దోచేసిన కి‘లేడి’

ఓ మ్యాట్రిమోని సైట్‌లో పరిచయమై, పెళ్లి పేరుతో ఓ యువతి రూ.17.89 లక్షలు దోచేసిందంటూ బాధితుడు హైదరాబాద్‌ సైబర్‌ క్రైమ్‌ పోలీసు ఠాణాలో ఫిర్యాదు చేశారు. ఎస్సై నరేష్‌ కథనం ప్రకారం

Published : 03 Nov 2021 01:42 IST

నారాయణగూడ, న్యూస్‌టుడే: ఓ మ్యాట్రిమోని సైట్‌లో పరిచయమై, పెళ్లి పేరుతో ఓ యువతి రూ.17.89 లక్షలు దోచేసిందంటూ బాధితుడు హైదరాబాద్‌ సైబర్‌ క్రైమ్‌ పోలీసు ఠాణాలో ఫిర్యాదు చేశారు. ఎస్సై నరేష్‌ కథనం ప్రకారం.. బోయినపల్లికి చెందిన కుమార్‌ వధువు కోసం ఓ వెబ్‌సైట్‌లో బయోడేటా పోస్టు చేశారు. ఓ మహిళ ఫోన్‌ చేసి ప్రముఖ వైద్యురాలినని పరిచయం చేసుకొని, తనకు నచ్చారని చెప్పింది. ‘త్వరలోనే హైదరాబాద్‌కు వస్తున్నా.. రాగానే పెళ్లి చేసుకుందాం.. తర్వాత మీరు అంగీకరిస్తే యూకే వెళ్తా.. లేదంటే హైదరాబాద్‌లోనే ప్రాక్టీస్‌ పెట్టుకుంటా’నని చెప్పింది. వాట్సాప్‌ నంబర్లు ఇచ్చిపుచ్చుకున్నారు. కొంతకాలం తరువాత ఇండియాకు వస్తున్నానని మీకు విలువైన బహుమతి తెస్తానంది. రెండు రోజుల తరువాతే దిల్లీ విమానాశ్రయం నుంచి కస్టమ్స్‌ అధికారుల పేరుతో వ్యక్తి ఫోన్‌ చేసి ఓ అమ్మాయి వచ్చింది.. మీ పేరుతో యూకే కరెన్సీలో కోటి రూపాయలు వెంటతెచ్చింది. కస్టమ్స్‌, ఇన్‌కంటాక్స్‌ కట్టాలని రూ.17.89 లక్షలు వసూలు చేశారు. తర్వాత అమ్మాయి, అధికారుల ఫోన్‌లు పని చేయడంతో బాధితుడు పోలీసులను ఆశ్రయించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని