Updated : 10/11/2021 08:33 IST

Suicide: కుమారుడి ఆత్మహత్య వార్త విని...ప్రాణాలు తీసుకున్న తల్లి, అమ్మమ్మ

గవర్నర్‌పేట, భీమవరం పట్టణం, న్యూస్‌టుడే: ఆర్థికపరమైన ఇబ్బందులు ఓ కుటుంబాన్ని బలిగొన్నాయి. విజయవాడ, పశ్చిమగోదావరి జిల్లా భీమవరం పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. భీమవరం టూ టౌన్‌ దిర్సుమర్రువారి వీధిలో వేమలమంద యోగేశ్వర వెంకట కార్తీక్‌ (35) తన తల్లి ఇందిరాప్రియ(50), అమ్మమ్మ గొట్టుముక్కల రాధాకృష్ణకుమారి(75)లతో కలిసి అద్దె ఇంట్లో ఉంటున్నాడు. తండ్రి గతంలోనే రోడ్డు ప్రమాదంలో చనిపోయారు. అవివాహితుడైన కార్తీక్‌ భీమవరంలో ఆక్వేరియం వ్యాపారం చేస్తున్నాడు. అతను తరచూ విజయవాడ వస్తుంటాడు. ఈ నెల 7వ తేదీ సాయంత్రం గవర్నర్‌పేట పిన్నెలవారివీధిలోని ఓ లాడ్జిలో దిగాడు. రాత్రి లాడ్జి బాయ్‌ వచ్చి సిగరెట్లు ఇచ్చి వెళ్లాడు. 8వ తేదీ సాయంత్రమైనా కార్తీక్‌ బయటకు రాకపోవడంతో యాజమాన్యం తలుపులు పగలకొట్టి చూడగా ఫ్యాన్‌కు ఉరేసుకుని విగతజీవిగా కనిపించాడు. ఘటనాస్థలంలో లభ్యమైన ఆధారాల మేరకు భీమవరంలో ఉంటున్న కుటుంబసభ్యులకు పోలీసులు సమాచారం అందించారు.

కార్తీక్‌ మరణవార్త వినగానే భీమవరంలో ఉన్న తల్లి ఇందిరాప్రియ, అమ్మమ్మ రాధాకృష్ణకుమారిలు తీవ్ర మనస్తాపం చెందారు. మంగళవారం ఉదయం ఇంట్లోనే వారు కూడా ఫ్యాన్లకు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. మృతదేహాలను పోలీసులు తరలిస్తుండగా వీరి పెంపుడు శునకం పెద్దగా అరచిన తీరు స్థానికులను కలచివేసింది. కార్తీక్‌ ఆత్మహత్యకు కారణాలపై విజయవాడ పోలీసులు ఆరాతీశారు. ఆక్వేరియం వ్యాపారంలో నష్టం రావటంతో అతను చెన్నై వెళ్లాడని, ఆ సమయంలో కొవిడ్‌ సోకటంతో వైద్యం కోసం రూ.లక్షల్లో అప్పులు చేయాల్సి వచ్చిందని తెలిసింది. కార్తీక్‌కు మేనమామ ఉన్నారని, ఆయన వచ్చిన తర్వాత మృతదేహాన్ని అప్పగిస్తామని విజయవాడ పోలీసులు వెల్లడించారు.

Read latest Crime News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని