Crime News: ‘ఫేస్‌మాస్క్‌’తో కాపీయింగ్‌ యత్నం 

పేస్‌మాస్క్‌ సాయంతో కాపీయింగ్‌కు పాల్పడేందుకు సిద్ధమైన ఓ అభ్యర్థి గుట్టురట్టు చేశారు 

Published : 22 Nov 2021 12:36 IST

హింజేవాడి: పేస్‌మాస్క్‌ సాయంతో కాపీయింగ్‌కు పాల్పడేందుకు సిద్ధమైన ఓ అభ్యర్థి గుట్టురట్టు చేశారు మహారాష్ట్ర పోలీసులు. పింప్రి చించ్‌వాడ్‌లో ఆదివారం పోలీసు కానిస్టేబుల్‌ రిక్రూట్‌మెంట్‌ పరీక్షకు ఏర్పాట్లు చేశారు. కేంద్రం వద్ద తనిఖీ చేస్తున్న సమయంలో ఓ అభ్యర్థి పెట్టుకున్న మాస్క్‌లో ఎలక్ట్రానిక్‌ పరికరం ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. పరిశీలిస్తుండగానే.. అతను పారిపోయాడు. మాస్క్‌తో పాటు అందులో ఉన్న సిమ్‌కార్డ్, మైక్, బ్యాటరీని స్వాధీనం చేసుకున్నారు. నిందితునిపై ‘మహారాష్ట్ర ప్రివెన్షన్‌ ఆఫ్‌ మాల్‌ ప్రాక్టీసెస్‌ చట్టం-1982’ ప్రకారం హింజేవాడి పోలీసులు కేసు నమోదు చేశారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని