Updated : 06/12/2021 09:28 IST

Crime News: మిత్రుల ఫొటోలతో వాట్సాప్‌లో ఛాటింగ్‌

సైబర్‌ నేరగాళ్ల నయా పంథా 

న్యూస్‌టుడే, తూప్రాన్‌ 

హాయ్‌ ఎలా ఉన్నావు.. ఏం చేస్తున్నావు.. రూ.5000 నా ఫ్రెండ్‌ నెంబర్‌కు గూగుల్‌ పే గానీ, ఫోన్‌పే కానీ చేయవా.. తనకు అత్యవసరం ఉంది.. అంటూ మిత్రుల ఫొటోలతో వాట్సాప్‌లో ఛాటింగ్‌ చేస్తూ నగదు కాజేస్తున్నారు సైబర్‌ నేరగాళ్లు. మొన్నటి వరకు బ్యాంకు అధికారులమని మాట్లాడి ఓటీపీ (వన్‌టైమ్‌ పాస్‌వర్డ్‌)తో నగదు కాజేసిన దుండుగులు ఈ తరహా మోసాలకు తెరతీశారు. తూప్రాన్‌లో శనివారం రాత్రి గంటల వ్యవధిలోనే 5 మంది నుంచి సుమారు రూ.30 వేల వరకు కాజేయడం గమనార్హం. సిద్దిపేట జిల్లా వర్గల్‌ మండలంలోని ఓ గ్రామానికి చెందిన యువకుడు అమెరికాలో ఉన్నత విద్య అభ్యసిస్తున్నారు. దీన్ని ఆసరాగా చేసుకున్న ఓ మోసగాడు అతడి చిత్రాన్ని వాట్సాప్‌ నెంబరుకు పెట్టి తూప్రాన్‌, వర్గల్‌ మండలాల్లో ఉన్న అతడి మిత్రులకు నగదు కోసం వల వేశాడు. అమెరికాలో ఉన్న సదరు యువకుడి మాదిరిగానే హాయ్‌ అని సందేశం పంపించారు. నా సోదరుడికి అత్యవసరంగా డబ్బు అవసరం ఉంది.. ఒక 5కే (రూ.5000) పంపించు అంటూ ఓ ఫోన్‌ నెంబరుపై సందేశంలో పంపించాడు. నిజంగానే తన మిత్రుడే అనుకొని పలువురు రూ.4, రూ.5 వేల చొప్పున సైబర్‌ నేరగాడు ఇచ్చిన ఫోన్‌నెంబరుకు ఆన్‌లైన్‌ ద్వారా పంపించారు. తీరా సైబర్‌ నేరగాడు నెంబరును స్విచ్చాఫ్‌ చేశాడు. దీంతో ఇక్కడి వారు అమెరికాలో ఉన్న స్నేహితుడిని ఆరా తీయగా నేనేం నగదు అడగలేదని చెప్పడంతో మోసపోయామని గ్రహించడం యువకుల వంతయింది. ఇన్‌స్టా, ఫేఫస్‌బుక్‌ సామాజిక మాధ్యమాల్లో ఉన్న మిత్రుల ఫొటోలను తీసుకొని సైబర్‌ నేరగాళ్లు యువకులను మోసం చేస్తున్నారు. ఇలాంటి సందేశాలు వస్తే ముందుగా ఆరా తీయాలని పోలీసులు సూచిస్తున్నారు. మొన్నటి వరకు పట్టణాలకే పరిమితమైన ఇలాంటి నేరాలు గ్రామీణ ప్రాంతాలకు పాకడం గమనార్హం.

Read latest Crime News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని