దోస్తులు చెప్పారని ఇల్లే దోచేశారు.. జల్సాలకు రూ.4 లక్షలు ఖర్చు చేసిన చిన్నారులు

తల్లిదండ్రులు ఇంట్లో దాచిన రూ.4 లక్షలు ఇరవై రోజుల్లో ఖర్చుచేశారు 9, 8 ఏళ్ల వయసున్న ఇద్దరు చిన్నారులు(సోదరులు). నెల రోజుల క్రితమే జరిగిన ఈ ఘటన శుక్రవారం జీడిమెట్ల ఠాణా పరిధిలో వెలుగుచూసింది.

Published : 21 May 2022 08:42 IST


చిన్నారులు కొనుగోలు చేసిన స్మార్ట్‌ఫోన్‌, వాచీలు, నకిలీ కరెన్సీ

జీడిమెట్ల, న్యూస్‌టుడే: తల్లిదండ్రులు ఇంట్లో దాచిన రూ.4 లక్షలు ఇరవై రోజుల్లో ఖర్చుచేశారు 9, 8 ఏళ్ల వయసున్న ఇద్దరు చిన్నారులు(సోదరులు). నెల రోజుల క్రితమే జరిగిన ఈ ఘటన శుక్రవారం జీడిమెట్ల ఠాణా పరిధిలో వెలుగుచూసింది. ఎస్‌.ఆర్‌.నాయక్‌ నగర్‌కు చెందిన దంపతులు నెల కిందట రూ.4లక్షలు తీసుకొచ్చి ఇంట్లో పెట్టారు. గమనించిన చిన్నారులు సమీపంలోని స్నేహితులు(13, 14 ఏళ్ల)తో చెప్పారు. వారిద్దరు వీరిని ఏమార్చి ఇంట్లో నగదు కొంచెం కొంచెం తీసుకొచ్చేలా ప్రోత్సహించారు. తీసిన డబ్బు స్థానంలో నకిలీ కరెన్సీ పెట్టేవారు. అలా తీసుకొచ్చిన డబ్బుతో అందరూ జల్సాలు చేస్తూ స్మార్ట్‌ఫోన్‌, స్మార్ట్‌ వాచీలు, గేమింగ్‌ సెంటర్‌లు, రెస్టారెంట్‌లకు వెళ్లారు. 20 రోజుల తర్వాత డబ్బును పరిశీలించగా కొంచమే ఉంది. అది కూడా నకిలీ కరెన్సీగా తేలడంతో తల్లిదండ్రులు కంగుతిన్నారు. చిన్నారులను అడగడంతో జరిగిన విషయం వివరించారు. తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదుతో దర్యాప్తు చేస్తున్నామని ఇన్‌స్పెక్టర్‌ కె.బాలరాజు వెల్లడించారు. మైనర్లకు నకిలీ కరెన్సీ ఎక్కడి నుంచి వచ్చింది అని విచారణ చేస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని