Bangalore: బెంగళూరులో ఐటీ ఉద్యోగినిపై అత్యాచారం

ఆంధ్రప్రదేశ్‌కు చెందిన సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగినిపై అత్యాచారానికి పాల్పడిన ఆరోపణలపై ఇద్దరు నైజీరియన్లను బెంగళూరు బాణసవాడి పోలీసులు అరెస్టు చేశారు. బాధితురాలి వివరాలను పోలీసులు బయటపెట్టలేదు. ఆమెపై దారుణానికి

Updated : 04 Sep 2021 06:49 IST

బెంగళూరు (మల్లేశ్వరం), న్యూస్‌టుడే: ఆంధ్రప్రదేశ్‌కు చెందిన సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగినిపై అత్యాచారానికి పాల్పడిన ఆరోపణలపై ఇద్దరు నైజీరియన్లను బెంగళూరు బాణసవాడి పోలీసులు అరెస్టు చేశారు. బాధితురాలి వివరాలను పోలీసులు బయటపెట్టలేదు. ఆమెపై దారుణానికి ఒడిగట్టినట్లు రెండు రోజుల కిందట ఫిర్యాదు అందిందని, శుక్రవారం ఆ కేసులో అబుజి ఉబాకా, టోనీలను నిందితులుగా గుర్తించామని దర్యాప్తు అధికారులు వివరించారు. తనపై అత్యాచారం జరిగిందని బాధిత యువతి ఇచ్చిన ఫిర్యాదు మేరకు దర్యాప్తు కొనసాగుతోంది. నైజీరియా రాయబార కార్యాలయానికి అరెస్టు సమాచారాన్ని పంపారు. బాధితురాలిని వైద్య పరీక్షల నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని