సినిమా థియేటర్లో అగ్నిప్రమాదం
యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ పట్టణంలోని అంజిరెడ్డి సినిమా థియేటర్లో సోమవారం మధ్యాహ్నం అగ్నిప్రమాదం సంభవించింది. ఉదయం ఆట ప్రారంభమైన అరగంటలోనే థియేటర్ వరండాలో మంటలు...
చౌటుప్పల్, న్యూస్‌టుడే: యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ పట్టణంలోని అంజిరెడ్డి సినిమా థియేటర్లో సోమవారం మధ్యాహ్నం అగ్నిప్రమాదం సంభవించింది. ఉదయం ఆట ప్రారంభమైన అరగంటలోనే థియేటర్ వరండాలో మంటలు చెలరేగడంతో లోపల దట్టమైన పొగ అలుముకుంది. ఆ సమయంలో 50 మంది వరకు సినిమా చూస్తున్నారు. మంటలు, పొగ వ్యాపించడాన్ని గమనించిన ప్రేక్షకులు తలుపులు తెరుచుకుని బయటకు పరుగులు తీశారు. థియేటర్ సిబ్బంది అక్కడి గోడలకు అమర్చిన అగ్నిమాపక యంత్రాలతో మంటలు ఆర్పేందుకు ప్రయత్నించగా అవి పని చేయలేదు. అక్కడికి చేరుకున్న ఎస్సై నాగిరెడ్డి అగ్నిమాపక కేంద్రానికి ఫోన్ ద్వారా సమాచారం అందించారు. ఆ శకటం చిట్యాల మండలంలో ఉన్నట్టు సమాధానం వచ్చింది. దీంతో థియేటర్ సిబ్బంది బాత్రూంలోని నీళ్లను బకెట్లతో తెచ్చి చల్లి మంటలు ఆర్పేశారు. థియేటర్ లోపలికి మంటలు వ్యాపించి ఉంటే భారీగా నష్టం జరిగి ఉండేది. రెవెన్యూ శాఖ గిర్దావర్ సుధాకర్‌రావు ప్రమాదస్థలానికి వచ్చి పంచనామా నిర్వహించారు. తహసీల్దార్ దశరథకు నివేదిక సమర్పించారు. ఈ ప్రమాదంపై ఫిర్యాదు నమోదు కాలేదని ఎస్సై నాగిరెడ్డి తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
ఇతరులను బెదిరించడం కాంగ్రెస్ సంస్కృతి.. ‘లాయర్ల లేఖ’పై ప్రధాని మోదీ
-
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
-
భుజంగరావు, తిరుపతన్నకు 5 రోజుల పోలీసు కస్టడీ
-
నా భర్తను వేధిస్తున్నారు..: సీఎం కేజ్రీవాల్ సతీమణి ఆరోపణలు
-
తెలంగాణ జెన్కో ఏఈ, కెమిస్ట్ ఉద్యోగ పరీక్ష వాయిదా
-
మస్క్ కీలక ప్రకటన.. వారికి ప్రీమియం సబ్స్క్రిప్షన్ ఫ్రీ!