స్థానికత కోల్పోతున్నానని ఉపాధ్యాయుడి ఆత్మహత్య

వరంగల్‌ జిల్లా నర్సంపేట మండలం చంద్రాయపల్లికి చెందిన ప్రభుత్వ ఉపాధ్యాయుడు ఉప్పల రమేశ్‌(45) ఆత్మహత్య చేసుకున్నారు. నర్సంపేట సీఐ పులి రమేశ్‌, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. ఖానాపురం మండలం ధర్మరావుపేట

Published : 26 Jan 2022 05:07 IST

నర్సంపేట, న్యూస్‌టుడే: వరంగల్‌ జిల్లా నర్సంపేట మండలం చంద్రాయపల్లికి చెందిన ప్రభుత్వ ఉపాధ్యాయుడు ఉప్పల రమేశ్‌(45) ఆత్మహత్య చేసుకున్నారు. నర్సంపేట సీఐ పులి రమేశ్‌, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. ఖానాపురం మండలం ధర్మరావుపేట శివారు బాలుతండా ప్రభుత్వ పాఠశాలలో రమేశ్‌ ఉపాధ్యాయుడిగా పని చేస్తున్నారు. అనారోగ్యంతో ఇబ్బందిపడేవారు. ఇటీవల ములుగు జిల్లా మల్లంపల్లికి బదిలీ అయ్యారు. స్థానికత కోల్పోతున్నానని.. ఇక నుంచి తన కుటుంబ స్థానికత ములుగు జిల్లా అవుతుందని మానసికంగా కుంగిపోయారు. ఈ క్రమంలో జీతం ధ్రువీకరణ పత్రం (ఎల్‌పీసీ) తీసుకొని వస్తానని ఇంట్లో చెప్పి సోమవారం ఖానాపురం బయలుదేరారు. నర్సంపేట శివారులో పురుగుల మందు తాగి పడిపోయారు. స్థానికులు ప్రైవేటు ఆసుపత్రిలో చేర్పించగా చికిత్స పొందుతూ మృతిచెందారు. ఆయనకు భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని