ధరణిలో నమోదుకాని మొత్తం భూమి..మనోవేదనతో రైతు ఆత్మహత్య

తనకున్న పొలం మొత్తం ధరణిలో నమోదు కాకపోవడం.. దీనిపై ఏడాదిన్నరగా అధికారుల చుట్టూ తిరుగుతున్నా ప్రయోజనం లేకపోవడంతో ఓ రైతు ఆత్మహత్యకు పాల్పడ్డారు. జోగులాంబ గద్వాల జిల్లా వడ్డేపల్లి మండలం

Updated : 27 Jan 2022 06:02 IST

శాంతినగర్‌, న్యూస్‌టుడే: తనకున్న పొలం మొత్తం ధరణిలో నమోదు కాకపోవడం.. దీనిపై ఏడాదిన్నరగా అధికారుల చుట్టూ తిరుగుతున్నా ప్రయోజనం లేకపోవడంతో ఓ రైతు ఆత్మహత్యకు పాల్పడ్డారు. జోగులాంబ గద్వాల జిల్లా వడ్డేపల్లి మండలం కొంకలలో బుధవారం ఈ ఘటన జరిగింది. గ్రామానికి చెందిన బోయ రాముడు (55)కు 257 సర్వే నంబరులో 2.50 ఎకరాల భూమి ఉంది. 1.30 ఎకరాలు మాత్రమే ధరణిలో చూపిస్తోంది. మిగతా పొలం నమోదు చేయాలని ఆయన రెవెన్యూ అధికారుల చుట్టూ తిరిగినా సమస్య పరిష్కారం కాలేదు. దీంతో మనస్తాపంతో బుధవారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో పురుగు మందు తాగారు. అనంతరం కుటుంబసభ్యులు రైతుని కర్నూలు ఆసుపత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ మృతి చెందారు. రైతు కుమారుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని