యడియూరప్ప మనవరాలి ఆత్మహత్య

కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి, భాజపా సీనియర్‌ నేత యడియూరప్ప మనవరాలు డాక్టర్‌ సౌందర్య(30) ఆత్మహత్య చేసుకున్నారు. శుక్రవారం ఉదయం స్థానిక వసంతనగరలోని అపార్టుమెంట్‌లో ఫ్యానుకు ఉరివేసుకున్నారు. యడియూరప్ప కుమార్తె పద్మావతి కూతురు అయిన సౌందర్యకు 2018లో నీరజ్‌తో వివాహమైంది. వైద్యులైన వీరిద్దరూ ఎంఎస్‌ రామయ్య ఆసుపత్రిలో పనిచేస్తున్నారు. నీరజ్‌ శుక్రవారం ఉదయం 8 గంటలకు విధులకు వెళ్లారు. మరో గంటలో సౌందర్య కూడా విధులకు వెళ్లాలి.

Published : 29 Jan 2022 05:27 IST

ఈనాడు డిజిటల్‌, బెంగళూరు: కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి, భాజపా సీనియర్‌ నేత యడియూరప్ప మనవరాలు డాక్టర్‌ సౌందర్య(30) ఆత్మహత్య చేసుకున్నారు. శుక్రవారం ఉదయం స్థానిక వసంతనగరలోని అపార్టుమెంట్‌లో ఫ్యానుకు ఉరివేసుకున్నారు. యడియూరప్ప కుమార్తె పద్మావతి కూతురు అయిన సౌందర్యకు 2018లో నీరజ్‌తో వివాహమైంది. వైద్యులైన వీరిద్దరూ ఎంఎస్‌ రామయ్య ఆసుపత్రిలో పనిచేస్తున్నారు. నీరజ్‌ శుక్రవారం ఉదయం 8 గంటలకు విధులకు వెళ్లారు. మరో గంటలో సౌందర్య కూడా విధులకు వెళ్లాలి. కుమారుడిని ఇంట్లోనే ఉన్న తన తల్లి వద్ద ఉంచి గదిలోకి వెళ్లారు. అల్పాహారం ఇచ్చేందుకు పనిమనిషి తలుపు తట్టగా.. తీయకపోవటంతో వెంటనే నీరజ్‌కు సమాచారం అందించారు. పోలీసుల సహాయంతో తలుపు పగలగొట్టగా అప్పటికే ఫ్యానుకు వేలాడుతున్న స్థితిలో సౌందర్య కనిపించారు. వెంటనే ఆసుపత్రికి తరలించగా.. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. మృతదేహానికి శవపరీక్షలు నిర్వహించారు. భర్త, బంధువుల ఫిర్యాదు మేరకు అనుమానాస్పద కేసుగా నమోదు చేశారు. సౌందర్య మృతదేహానికి భర్త నీరజ్‌కు చెందిన ఫామ్‌హౌజ్‌లోనే అంత్యక్రియలు నిర్వహించారు.

డిప్రెషనే కారణమా?

సౌందర్యకు 9 నెలల మగబిడ్డ ఉన్నాడు. బిడ్డ పుట్టిన తర్వాత సౌందర్య డిప్రెషన్‌కి లోనైనట్లు ఆమె సహ ఉద్యోగులు వివరించారు. నిపుణుల సలహాతో ఇంటివద్దనే చికిత్స తీసుకుంటున్నారు. భార్యాభర్తలు అన్యోన్యంగా జీవనం సాగించినట్లు స్థానికులు తెలిపారు. సౌందర్య దంపతులు ఏనాడూ చంటిబిడ్డను బయటకు తీసుకురాలేదని.. గురువారమే ఆమె బిడ్డతో వెలుపలికి వచ్చిందని చెప్పారు. 

* యడియూరప్ప మనవరాలి మృతి పట్ల ప్రధానమంత్రి నరేంద్రమోదీ, మాజీ ప్రధాని దేవేగౌడ, కర్ణాటక గవర్నర్‌ థావర్‌ చంద్‌ గెహ్లోత్‌, ముఖ్యమంత్రి బసవరాజ బొమ్మై తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని