సిక్కోలు జిల్లాలో చెలరేగిన గొలుసు దొంగలు

శ్రీకాకుళం జిల్లాలో గురువారం పట్టపగలే వేర్వేరు చోట్ల గొలుసు దొంగతనాలు జరిగాయి. శ్రీకాకుళంలో ఓ మహిళ మెడలోని 11 తులాల బంగారు నల్లపూసల గొలుసు, పుస్తెలతాడును గురువారం దుండగులు అపహరించుకుపోయారు.

Updated : 20 May 2022 19:44 IST

శ్రీకాకుళం నేరవార్తావిభాగం, న్యూస్‌టుడే: శ్రీకాకుళం జిల్లాలో గురువారం పట్టపగలే వేర్వేరు చోట్ల గొలుసు దొంగతనాలు జరిగాయి. శ్రీకాకుళంలో ఓ మహిళ మెడలోని 11 తులాల బంగారు నల్లపూసల గొలుసు, పుస్తెలతాడును గురువారం దుండగులు అపహరించుకుపోయారు. అదే తరహాలో ఇచ్ఛాపురంలోనూ మరో ఘటన జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. శ్రీకాకుళంలోని కాకివీధికి చెందిన భోగి లక్ష్మణరావు, అతని భార్య రాధాకుమారి గురువారం ఉదయం ద్విచక్ర వాహనంపై బయటకు వెళ్తున్నారు. సూర్యమహల్‌ కూడలి సమీపంలోకి రాగానే వెనుక నుంచి ఇద్దరు వ్యక్తులు ద్విచక్ర వాహనంపై వచ్చారు. వారిలో డ్రైవింగ్‌ చేస్తున్న దుండగుడు మహిళ మెడలోని బంగారు ఆభరణాలు లాగేశాడు. వెంటనే అతివేగంగా పరారయ్యారు. ఇచ్ఛాపురంలో పైల సరస్వతి అనే మహిళ మార్కెట్‌కు వెళ్లి వస్తుండగా ఇద్దరు దుండగులు ద్విచక్రవాహనంపై వచ్చి పుస్తెలతాడును తెంపేసి పరారయ్యారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని