తెలుగు ఐఏఎస్‌ అధికారి రాజేష్‌పై కేసు

గుజరాత్‌ సాధారణ పరిపాలన శాఖలో (జీఏడీ) సంయుక్త కార్యదర్శిగా పనిచేస్తున్న కంకిపాటి రాజేష్‌(36)పై కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) దిల్లీ యూనిట్‌ కేసు నమోదు చేసింది. రాజమహేంద్రవరానికి చెందిన రాజేష్‌ 2011 బ్యాచ్‌కు చెందిన

Published : 21 May 2022 05:23 IST

అనర్హులకు భూకేటాయింపుల ఆరోపణలు
ఆయన నివాసాల్లో డాక్యుమెంట్లు, డిజిటల్‌ సాక్ష్యాల స్వాధీనం

ఈనాడు, దిల్లీ: గుజరాత్‌ సాధారణ పరిపాలన శాఖలో (జీఏడీ) సంయుక్త కార్యదర్శిగా పనిచేస్తున్న కంకిపాటి రాజేష్‌(36)పై కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) దిల్లీ యూనిట్‌ కేసు నమోదు చేసింది. రాజమహేంద్రవరానికి చెందిన రాజేష్‌ 2011 బ్యాచ్‌కు చెందిన గుజరాత్‌ క్యాడర్‌ ఐఏఎస్‌ అధికారి. 2021లో ఆయన గుజరాత్‌లోని సురేంద్రనగర్‌ జిల్లా కలెక్టర్‌గా పని చేశారు. ఆ సమయంలో ఆయుధాల లైసెన్సుల మంజూరుకు లంచాల వసూళ్లు, అనర్హులకు ప్రభుత్వ భూముల కేటాయింపు, ఆక్రమించిన భూములను క్రమబద్ధీకరించారనే ఆరోపణలు రావడంతో విచారణ చేపట్టాలని గుజరాత్‌ప్రభుత్వం సీబీఐని కోరింది. ప్రాథమిక విచారణ పూర్తి చేసిన సీబీఐ ఈ కేసులో దళారీగా వ్యవహరించిన జీన్స్‌ కార్నర్‌ అనే ప్రైవేటు కంపెనీ యజమాని రఫీక్‌ మెమెన్‌ను అరెస్టు చేసి అహ్మద్‌నగర్‌లోని సీబీఐ కేసుల ప్రత్యేక న్యాయస్థానంలో హాజరుపర్చింది. ప్రాథమిక విచారణ ఆధారంగా రాజేష్‌కు చెందిన గాంధీనగర్‌, సూరత్‌, రాజమహేంద్రవరం నివాసాల్లో గురువారం అర్ధరాత్రి సీబీఐ సోదాలు చేసింది. సోదాల్లో నేరారోపణలకు సంబంధించిన పలు డాక్యుమెంట్లను, డిజిటల్‌ సాక్ష్యాధారాలను స్వాధీనం చేసుకుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని