అప్పుల బాధతో రైతు ఆత్మహత్య

సరైన పంట దిగుబడులు రాకపోవడంతో.. సాగుతో పాటు వైద్య ఖర్చుల కోసం చేసిన అప్పులను ఎలా తీర్చాలనే బెంగతో ఓ రైతు బలవన్మరణానికి పాల్పడ్డారు. ఈ ఘటన శనివారం సిద్దిపేట జిల్లా జగదేవపూర్‌ మండలంలో చోటు చేసుకుంది.

Published : 22 May 2022 05:52 IST

జగదేవపూర్‌, న్యూస్‌టుడే: సరైన పంట దిగుబడులు రాకపోవడంతో.. సాగుతో పాటు వైద్య ఖర్చుల కోసం చేసిన అప్పులను ఎలా తీర్చాలనే బెంగతో ఓ రైతు బలవన్మరణానికి పాల్పడ్డారు. ఈ ఘటన శనివారం సిద్దిపేట జిల్లా జగదేవపూర్‌ మండలంలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రాయవరం గ్రామానికి చెందిన దబ్బెట మల్లేశం (56) తనకున్న ఎకరానికి తోడు ఎకరంన్నర భూమిని కౌలుకు తీసుకుని సాగు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. రెండేళ్లుగా పత్తి సాగు చేస్తుండగా సరైన దిగుబడులు రాలేదు. దీనికి తోడు ఇటీవల పెద్ద కుమారుడు అనారోగ్యం బారిన పడడంతో వైద్యం కోసం అప్పులు చేశారు. రూ.రెండున్నర లక్షలకు చేరిన అప్పులను తీర్చే మార్గం కనిపించక కొంతకాలంగా మనస్తాపంతో ఉన్నారు. ఈ క్రమంలోనే శనివారం ఆయన గ్రామ శివారులో పురుగు మందు తాగి ఇంటికి వచ్చారు. అతని నోట్లోనుంచి నురగ రావడంతో అనుమానించిన కుటుంబ సభ్యులు 108 వాహనంలో గజ్వేల్‌ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మరణించారు. చిన్న కుమారుడు కరుణాకర్‌ ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై కృష్ణమూర్తి తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని