ఇండోనేషియాలో ఘోరప్రమాదం:26మంది మృతి

ఇండోనేషియాలోని జావా దీవిలో బుధవారం అర్ధరాత్రి ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. యాత్రికులతో తీర్థయాత్రకు వెళ్తున్న బస్సు ప్రమాదవశాత్తూ లోయలో పడిపోవడంతో 26మంది దుర్మరణం పాలయ్యారు. మరో 35 మంది గాయాల పాలయ్యారు. 

Updated : 11 Mar 2021 11:53 IST

జకార్తా: ఇండోనేషియాలోని జావా దీవిలో అర్ధరాత్రి ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. యాత్రికులతో వెళ్తున్న బస్సు ప్రమాదవశాత్తూ లోయలో పడిపోవడంతో 26మంది దుర్మరణం పాలయ్యారు. మరో 35 మందికి గాయాలయ్యాయి.

సుమేడాంగ్‌ జిల్లా పోలీస్‌ అధికారి తెలిపిన వివరాల ప్రకారం.. పశ్చిమ జావాలోని ఇస్లామిక్‌ జూనియర్‌ కళాశాలకు చెందిన విద్యార్థులు తల్లిదండ్రులతో కలిసి బస్సులో తీర్థయాత్రకు బయలు దేరారు. బుధవారం అర్ధరాత్రి సుమేడాంగ్‌ జిల్లాలో ప్రయాణిస్తున్న సమయంలో డ్రైవర్‌ బస్సుపై నియంత్రణ కోల్పోయాడు. దీంతో బస్సు అదుపుతప్పి లోయలో పడిపోయింది. ఈ ప్రమాదంలో 26 మంది మృతి చెందగా.. మరో 35 మంది గాయాల పాలయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు సహాయక చర్యలు ప్రారంభించారు. బాధితులను లోయ నుంచి వెలికితీశారు. క్షతగాత్రులను సమీపంలో ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. 

ప్రమాదానికి గల కారణాలపై పోలీసులు విచారణ ప్రారంభించారు. బస్సు బ్రేకులు పనిచేయకపోవడం వల్లే ప్రమాదం సంభవించిందని బాధితులు వెల్లడించినట్లు పోలీసులు తెలిపారు. 
 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని